జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ రెండు సీట్లకు ప్రత్యేక ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రమంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ లోకసభ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందటంతో వారు తమ రాజ్యసభ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో ఈ రెండు స్థానాలకు ప్రత్యేక ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రత్యేక ఎన్నికలు నిర్వహించటం చట్ట విరుద్ధమంటూ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గోవైలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఎన్నికల కోసం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 32కింద కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించజాలదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.