జాతీయ వార్తలు

31లోగా సమాధానం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీట్ కేసులో రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం
తదుపరి విచారణ ఏప్రిల్ 7కు వాయిదా
న్యూఢిల్లీ, మార్చి 17: వైద్య విద్య ప్రవేశ పరీక్ష కోసం జాతీయ వైద్య మండలి నిర్వహించ తలపెట్టిన నీట్ (నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రన్స్ టెస్ట్) కేసును సుప్రీంకోర్టు ఏప్రిల్ 7వ తేదీకి వాయిదా వేసింది. దీనికి సంబంధించిన పిటిషన్‌పై మార్చి 31వ తేదీ నాటికి లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలంటూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను, వైద్య కళాశాలల యాజమాన్యాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం నాలుగు రోజుల్లో రిజాయిండర్ సమర్పించాలని జాతీయ వైద్య మండలిని, కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు దాఖలైన పిటిషన్‌లో ప్రస్తుతం తెలంగాణను ప్రతివాదిగా చేర్చాలని ఏపి, తెలంగాణ వైద్య కళాశాలల సంఘం కోర్టును కోరింది.