వరంగల్

ట్రాఫిక్ నియమాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 21: యువత ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సూచించారు. గురువారం 27వ జాతీయ రహదారి భద్రత వారోత్సవాలు పురస్కరించుకొని వరంగల్ ట్రాఫిక్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులచే రోడ్డు భద్రత అవగాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం చైతన్య విద్యాసంస్థలో విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధిక సంఖ్యలో మరవీస్తున్నవారు యువత అని ఇందుకు ముఖ్యకారవీం యువత తమ వాహనాలపై మితిమీరిన వేగంగా ప్రయాణించడమే కారవీమని సిపి పేర్కొన్నారు. తమ పిల్లల అవసరాల కోసం తల్లిదండ్రులు అందజేస్తున్న ద్విచక్ర వాహనాలు తమ మృత్యు శకటాలుగా మార్చుకోవద్దని సూచించారు. దేశంలో అనారోగ్య కారణాలతో మరణించిన వారి సంఖ్య కన్నా రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాలను పాటించడం తమ వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలన్నారు. ముఖ్యంగా నేటి యువత రోడ్డు ప్రమాదాలకు గురై తమ తల్లిదండ్రుల వేదనకు గురి చేయవద్దని తెలిపారు. చైతన్య విద్యాసంస్థల చైర్మన్ పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ పోలీస్ విభాగం యువత క్షేమం కోసమే పని చేస్తుందని, వారు సూచించిన ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించడం యువతకే శ్రేయస్కరమన్నారు. అనంతరం చైతన్య కాలేజీ నుండి కమిషనర్ కార్యాలయం వరకు నిర్వహించిన ర్యాలీని పోలీస్ కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి వెంకటేశ్వర్‌రావు, హన్మకొండ, కాజీపేట ఇన్‌స్పెక్టర్లు వెంకటేష్, బాబూరావు, ఎస్సైలు హతిరామ్, దత్తాద్రి, మధు తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.