హైదరాబాద్

త్వరలో గ్రేటర్ కౌన్సిల్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ ఉద్యమంలో చూపిన సత్తాను మేయర్‌గా నగరాభివృద్ధి సాధించటంలోనూ చూపుతానని, ఇందుకు నగరవాసులు, అధికారులు ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలని కొత్త మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం ఆయన మేయర్‌గా జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయంలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరాభివృద్ధికి ఎలాంటి అభివృద్ధి పని చేపట్టినా, కేవలం జిహెచ్‌ఎంసి అధికారులే గాక, ఇతర శాఖలకు చెందిన అధికారుల నుంచి సమన్వయం అవసరమన్న విషయాన్ని గుర్తించామని, అందుకే రెండు రోజుల్లో అధికారుల్లో సమన్వయం సమావేశాలను నిర్వహించి, ఆ తర్వాత ఈ నెలాఖరులోగా సర్వసభ్య కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై రెండురోజుల్లో అధికారులతో చర్చించి స్పష్టతనివ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తాను దాదాపు దశాబ్దం కాలం కన్నా ఎక్కువ ప్రజల్లో ఉన్నామని, నగర ప్రజల సమస్యలు బాగా తెలుసునని, ఇటీవలి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో భాగంగా కార్పొరేటర్లు సైతం తమ ఎన్నికల ప్రచారంలో డివిజన్ల వారీగా సమస్యలను గుర్తించారని, వాటి పరిష్కారానికి ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
చారిత్రక హైదరాబాద్ నగరంలో అరవై ఏళ్లుగా అడపాదడపా కొన్ని అభివృద్ధి పనులు జరిగినా, అవి ఏ మాత్రం ప్రణాళికబద్ధంగా జరలేదని, ఇపుడైనా మన నగరాన్ని ఎంతో ముందుచూపుతో అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు కూడా తన సూచనలు, సలహాలివ్వవచ్చని ఆయన తెలిపారు. అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థ కారణంగా, చినుకుపడితే చాలు రోడ్లపై మురుగు నీరు, వర్షపు నీరు నిలిచే దుస్థితి ఏర్పడిందని మేయర్ వివరించారు.
శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరానికి తాతల కాలం నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రెండు రిజర్వాయర్లు ఉన్నాయే తప్ప, బయట నుంచి తీసుకువస్తున్న నీటిని నిల్వ చేసుకునేందుకు ఒక్క రిజర్వాయర్‌ను కూడా నిర్మించుకపోవటం కారణంగా నేటికీ కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి తాగునీరు వచ్చే ప్రాంతాలున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాం: డిప్యూటీ మేయర్ ఫసియుద్దిన్
అనంతరం డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మాదిరిగానే ముఖ్యమంత్రి కెసిఆర్, మున్సిపల్ మంత్రి కెటిఆర్ విజన్‌తో అందరి సహకారంతో నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దటంలోనూ తమవంతు భాగస్వామ్యం ఉంటుందని వ్యాఖ్యానించారు.
ఐటి జోన్‌లో
పోలీసుల నాకాబందీ
గచ్చిబౌలి, ఫిబ్రవరి 12: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటి సెక్టార్‌లో పోలీసులు నాకబందీ నిర్వహించారు. ఐటి సెక్టార్‌లో భద్రతలో భాగంగా గచ్చిబౌలి రాయదుర్గం, మాదాపూర్, చందానగర్‌లో వాహనాలను పోలీసులు తనిఖీ నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలులేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఆయా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్, క్యూఆర్‌టి పోలీసు బృందాలు తనిఖీ నిర్వహించారు. మాదాపూర్ ఏసిపి మాట్లాడుతూ ఐటి సెక్టార్‌లో భద్రతలో భాగంగా తనిఖీలు నిర్వహించామని చెప్పారు.