జాతీయ వార్తలు

తమిళనాడు అసెంబ్లీ నుంచి విపక్షాలు వాకౌట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు క్రీడపై విధించిన నిషేధంపై ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. జల్లికట్టుపై నిషేధం ఎత్తేయాలని, సత్వరమే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ప్రశ్నోత్తరాల తర్వాత కూడా డీఎంకే జల్లికట్టుపై చర్చించేందుకు స్పీకర్‌ను అనుమతి కోరగా.. స్పీకర్‌ అనుమతించలేదు. దీంతో డీఎంకే నేత స్టాలిన్‌ ఆధ్వర్యంలో పార్టీ నేతలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేశారు.