జాతీయ వార్తలు

వణికిస్తున్న ప్రకృతి విలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: గత కొన్ని రోజులుగా తూర్పు, ఉత్తర భారత రాష్ట్రాలలో ప్రకృతి విలయానికి ప్రజలు అల్లాడుతున్నారు. 13రాష్ట్రాల్లోనూ, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే గత రాత్రి నుంచి ఢిల్లీని దుమ్ము తుపాను వణికిస్తోంది. దుమ్మూ,దూళి నిండిపోవటంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఢిల్లీకి సమీపంలోని గుడ్‌గావ్,నోయిడా, రోహతక్, బివానీ, ఝూజ్జార్, మీరట్, ఘజియాబాద్‌లలో దుమ్ము తుపాను కమ్మేసింది. ప్రజలు బయటకు రావటానికి భయపడతున్నారు. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మరో 24 గంటల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలోనూ దుమ్ము తుపాను సంభవించింది. త్రిపురలో కురిసిన భారీ వర్షాలకు వెయ్యి ఇళ్లు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.