సాహితి
టవర్ ఆఫ్ బెబెల్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 November 2015
- నిఖిలేశ్వర్ 9177881201
ఇదే క్షణం ప్రతి క్షణం
మాటల కాలుష్య మేఘాలన్నీ
ఢీకొంటున్న ఆకాశంలో
శబ్ద తరంగాలను వర్షించే
‘ఇ’కాలమంతా
‘టాక్‌టైమ్’ లెక్కల్లో
గలగలా మోగుతూ
ఎవరి యాసలో వారు
సెల్‌ఫోన్ వాసులై
ఎడతెగని కబుర్లతో
‘ఫేస్‌బుక్’ ఆకర్షణలో
ఒంటరితనాన్ని -
తప్పించుకు తిరిగే
ఈ భూగోళం మీదే
‘టవర్ ఆఫ్ బెబెల్’ నిర్మించుకున్న మనం
ఎవరికీ ఎవరూ అర్థంకాని
పదాల గందరగోళాల్లో
ధ్వంసమవుతున్న
జీవన విలువలపై
మతం, గతం, చమురు నిల్వల
మానవ మారణహోమంపై
వికటాట్టహాసంగా
ఈ ఇరవైక్కో శతాబ్దం!!