జాతీయ వార్తలు

త్రయంబకేశ్వర ఆలయంలో పురుషులకు ‘నో ఎంట్రీ’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాసిక్: ఆలయాల్లో మహిళల ప్రవేశాన్ని అడ్డుకోలేమంటూ ముంబయి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇపుడు కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు ఇవ్వాల్సిందేనని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసిక్ (మహారాష్ట్ర)కు సమీపంలోని పురాతన త్రయంబకేశ్వర ఆలయం గర్భగుడిలోకి సోమవారం నుంచి పురుషులను కూడా అనుమతించడం లేదు. ఈ ఆలయ గర్భగుడిలోకి మహిళలు రాకూడదన్న నిషేధం ఎప్పటినుంచో అమలవుతోంది. లింగ సమానత్వం పాటించేందుకే ఇక గర్భగుడిలోకి పురుషులను కూడా అనుమతించకూడదని ఆయల పాలక మండలి ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలో రోజూ ఉదయం గంటసేపు మాత్రం పురుషులను అనుమతించేవారు. పాలక మండలి తాజా నిర్ణయంతో ఇకపై గర్భగుడిలోకి పురుషులను అనుమతించరు.