జాతీయ వార్తలు
26/11 మృతులకు ఎఐఎటిఎఫ్ నివాళులు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ముంబయి, నవంబర్ 26: ఏడేళ్ల క్రితం ముంబయి నగరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన వారికి అఖిల భారత ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్ (ఎఐఎటిఎఫ్) గురువారం ఇక్కడ నివాళులు అర్పించింది. 2008లో ముంబయిలోని ఉగ్రవాద దాడులకు గురయిన ప్రాంతాలు- పోలీస్ జింఖానా, చౌపట్టి వద్ద గల ఓంబుల్ విగ్రహం, నారిమన్ పాయింట్ వద్ద గల ట్రిడెంట్ హోటల్, కొలాబాలోని కేఫ్ లియోపోల్డ్, హోటల్ తాజ్మహల్ ప్యాలెస్, ఛత్రపతి శివాజీ టెర్మినస్లను ఎఐఎటిఎఫ్ చైర్మన్ ఎం.ఎస్.్భట్టా తమ సంస్థకు చెందిన ఇతర సభ్యులతో కలిసి గురువారం సందర్శించి దాడుల్లో మృతిచెందిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం భిట్టా పిటిఐ వార్తాసంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ‘26/11 దాడి జరిగిన ఏడేళ్ల తరువాత ముంబయి, భారత్, మన సరిహద్దులు ఎంతో సురక్షితం అయ్యాయి. అయితే ఇటీవల పారిస్లో ఉగ్రవాదులు జరిపిన భయంకర దాడుల తరువాత ప్రభుత్వం ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ గురించి మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ఇటీవల పారిస్లో జరిగినటువంటి దాడులు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు. ప్రభుత్వం ఉగ్రవాద వ్యతిరేక సైనిక న్యాయస్థానం (యాంటీ టెర్రరిస్ట్ మిలిటరీ కోర్ట్)ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.