జాతీయ వార్తలు

ట్రంప్ ప్రతిపాదనను స్వాగతించిన ఇమ్రాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కశ్మీర్ సమస్య పరిష్కారంలో తాను మధ్యవర్తిగా ఉండేందుకు సంతోషిస్తానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్వాగతించారు. ద్వైపాక్షిక చర్చల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోలేమని ఆయన అన్నారు. కశ్మీర్ సమస్యపై అమెరికా పెద్ద పాత్ర పోషిస్తుందని, ట్రంప్ పాత్ర విశేషంగా ఉంటుందని పేర్కొన్నారు. భారత్ తన అణ్వాయుధ సమీకరణను నిలిపివేస్తే తాము కూడా నిలిపివేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య అణు యుద్ధం జరుగదని, ఒకవేళ జరిగతే అది సొంత ధ్వంసమే అవుతుందని అన్నారు.