జాతీయ వార్తలు

ట్రంప్ రాక స్నేహబంధానికి సూచిక:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈనెల 22న అమెరికాలోని హుస్టన్‌లో నిర్వహించనున్న హౌదీ మోదీ సభకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారని శే్వతసౌథం ప్రకటించటంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ ట్రంప్ రాక భారత్-అమెరికా స్నేహ సంబంధాన్ని సూచిస్తుందన్నారు. ఆమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారతీయులు అందిస్తున్న భాగస్వామ్యాన్ని తెలియజేస్తుందని మోదీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా హుస్టన్‌లో భారతీయ సంతతికి చెందినవారు ఈ సభను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ట్రంప్‌ను ఆహ్వానించేందుకు తాను ఆసక్తిగా ఉన్నట్లు మోదీ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన ట్రంప్ ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు.