జాతీయ వార్తలు

సౌదీలోని కార్మికులను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ నుండి సౌదీ అరేబియాకు ఉపాధికోసం వెళ్లిన కార్మికులను కాపాడాలని కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ ఈ మేరకు బుధవారం లేఖ రాశారు.

బిసిల జాబితాలో మార్పులు

న్యూఢిల్లీ, ఆగస్టు 3: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 121 కులాలను కేంద్ర ఇతర వెనుకబడిన కులాల జాబితాలో చేరుస్తున్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేంద్ర ఓబిసి (ఆదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్) జాబితాలో అవసరమైన మార్పులు చేర్పులు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ఒబిసి జాబితాలో ఈ మార్పులు,చేర్పులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 35 కొత్త కులాలను కేంద్ర ఒబిసి జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన కులాల కమీషన్ సిఫారసు చేసింది. ఇదే విధంగా తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి 86 కులాలను కేంద్ర ఒబిసి జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన కులాల కమీషన్ సిఫారసు చేసింది. కేంద్ర ఒబిసి జాబితాలో ఈ మార్పులు చేయటం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ఈ కులాల వారు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల సౌకర్యం పొందేందుకు వీలు కలుగుతుంది.