హైదరాబాద్

మై జిహెచ్‌ఎంసి యాప్‌కు స్పందన భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: మహానగర ప్రజలకు అతి ముఖ్యమైన, అత్యవసరమైన సేవలందించే జిహెచ్‌ఎంసి ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నందున, వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ఇటీవలే మైజిహెచ్‌ఎంసి యాప్‌ను ప్రారంభించి సంగతి తెలిసిందే. రోజురోజుకి ఈ యాప్‌కు స్పందన పెరుగుతోంది. గత నెల 15న ప్రారంభించిన ఈ యాప్ అందుబాటులోకి వచ్చిన కేవలం 40రోజుల్లోనే ఇప్పటి వరకు దాదాపు 88వేల 438 మంది డౌన్‌లోడ్ చేసుకోగా, ఈ యాప్‌కు ప్రజల నుంచి ఇప్పటి వరకు సుమారు 8వేల 176 ఫిర్యాదులు అందగా, వీటిలో 6వేల 553 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదుల్లో 79వేల 94 శాతం ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయి. నిర్ణీత కాలంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించిన ఇంజనీర్లు పి. శ్రీనివాస్, ఎం.శంకర్, కె. రిష్మారెడ్డి, వై.సత్తిరెడ్డి, చరణ్‌సింగ్‌లను కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా తమకు అందిన పిర్యాదుల్లో యాభై శాతం కన్నా తక్కువగా పరిష్కరించి, పనితీరు నిరాశజనకంగా ఉన్న ఏఎంవోహెచ్‌లు డా. ఐజాజ్ ఖాసీం, డా. లక్ష్మణ్‌సింగ్, డిప్యూటీ కమిషనర్లు ప్రదీప్. ఎన్. అశోక్ సామ్రాట్, అసిస్టెంటు ఇంజనీర్లు శ్రీనివాసరావు, జి. బహుసింగ్, సి.కృష్ణలను సంజాయిషీ సమర్పించాలని సూచిస్తూ కమిషనర్ తాఖీదులు జారీ చేశారు. మనం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ఈ ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీనిపై ప్రజలు కూడా నమ్మకం పెట్టుకుంటారని, అందుకే దేశ విదేశాల్లోని నగరవాసులు కూడా పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సకాలంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాలని కమిషనర్ సూచించారు. ఏడుగురు అధికారులకు తాఖీదులు జారీ చేసిన కమిషనర్ ఆన్‌లైన్ అనుమతులతో పాటు ఆన్‌లైన్‌లోనే ప్రజల సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్‌కు వస్తున్న ఫిర్యాదుల పరిశీలన, పరిష్కారం అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తేలిపోయింది. దీంతో అధికారుల్లో ఒకింత భయం వ్యక్తమవుతోంది. కమిషనర్ సైతం కనీసం నెలకొసారి ఈ యాప్‌కు వచ్చిన సమస్యలు, ఫిర్యాదులు వాటి పరిష్కార పురోగతిని సమీక్షిస్తే అధికారుల్లో జవాబుదారితనం పెరిగి సకాలంలో ఫిర్యాదులను పరిష్కరిస్తారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
వౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 24: కోటి మంది జనాభా కల్గిన మహానగరంలో ఎప్పటికపుడు పెరుగుతున్న రద్దీ, జనాభాకు అనుగుణంగా వౌలిక వసతులను మెరుగుపర్చాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తుచేశారు జిహెచ్‌ఎంసి కమిషనర్ డా. బి. జనార్దన్ రెడ్డి. టౌన్‌ప్లానింగ్ విభాగం పనితీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించిన కమిషనర్ అందులో భాగంగా నగరంలో కొత్తగా ఏర్పాటు చేయదల్చిన బస్ షెల్టర్లకు వీలైనంత త్వరగా స్థలాలను గుర్తించాలని, ఇందుకు రెవెన్యూ అధికారులు, గ్రేటర్ ఇంజనీర్లు కలిసి సమష్టిగా సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల మేరకు రోడ్లు ఉండగా, వీటిలో కేవలం 2 వేల బస్టాపులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిల్లోనూ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు లేనివి కూడా ఉన్నాయన్నారు. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుకూలంగా బస్ స్టాండ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉందన్న విషయాన్ని గుర్తించి అధికారులు స్థలాలను అనే్వషించాలని ఆదేవించారు. ఇప్పటికే గుర్తించిన పలు స్థలాలకు సంబంధించి ఆయా శాఖల నుంచి భూములు సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇటీవల జరిగిన పలు ప్రమాదాల ద్వారా అమాయకులైన కార్మికులు మరణించడాన్ని ప్రస్తావిస్తూ, కింది స్థాయిలో పనిచేసే మేస్ర్తిలు, సూపర్‌వైజర్లకు తగు భద్రత చర్యలను పాటించే విధంగా వారికి జెఎన్‌టియు, న్యాక్ సంస్థల ప్రతినిధుల ద్వారా ప్రతి శనివావంర ప్రత్యేక శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ సొషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ శిక్షణ దేశంలోనే మొట్టమొదటి సారిగా మన నగరంలో మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా టౌన్‌ప్లానింగ్ అంశాలు, భవన నిర్మాణ అనుమతులు, ఇతర అంశాలపై నగరవాసులకు ప్రతి శనివారం నాడు అన్ని డిప్యూటీ కమిషనర్ కార్యాలయాల్లో అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు, మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు మరింత విజయవంతమయ్యేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో ఫలిస్తే ప్రజల్లో టౌన్‌ప్లానింగ్ అంశాలపై అవగాహన పెరిగి, అవినీతి అక్రమాలు తగ్గే అవకాశముందని కమిషనర్ అభిప్రాయ పడ్డారు.