జాతీయ వార్తలు

దేశవ్యాప్తంగా ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/ తిరువనంతపురం, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు మూలంగా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాలు ఇచ్చిన బంద్, ఆందోళన కార్యక్రమాల పిలుపులతో సోమవారం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో 12 గంటల పాటు బంద్ సంపూర్ణంగా జరిగింది. ఈ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. వామపక్షాలు ఆందోళనలతో పాటు బంద్‌కు పిలుపునివ్వగా, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు కేవలం ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. జెడి(యు), బిజెడిలు ఆందోళన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకె, సిపిఎం, సిపిఐ తదితర ప్రతిపక్ష పార్టీలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ అరెస్టయ్యారు. అరెస్టయిన వారిలో డిఎంకె కోశాధికారి ఎంకె స్టాలిన్, సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు జి.రామకృష్ణన్, ఆర్.ముత్తరసన్ తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, జాతీయ బ్యాంకుల ముందు ఈ మూడు పార్టీల శ్రేణులు విడివిడిగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుండగా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో సిపిఎం, సిపిఐ సహా ఏడు వామపక్షాల శ్రేణులు తమ ఆందోళన కార్యక్రమాల సందర్భంగా పాత నోట్లు చెల్లవంటూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పేదల వ్యతిరేక చర్యని, కార్పొరేట్ వర్గాలకు లబ్ధి చేకూర్చే చర్య అని విమర్శించాయి. కొత్త నోట్లు వచ్చే వరకు పాత నోట్లను అనుమతించాలని డిమాండ్ చేశాయి. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో సోమవారం ‘జన్ ఆక్రోశ్ దివస్’ సందర్భంగా గ్వాలియర్ డివిజనల్ కమిషనర్ ఎస్‌ఎన్ రూప్లాసింగ్‌కు వినతిపత్రం సమర్పించిన కొద్దిసేపటికే కాంగ్రెస్ పార్టీ గ్వాలియర్ జిల్లా అధ్యక్షుడు దర్శన్ సింగ్ గుండెపోటుతో మృతి చెందారు.
కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) ఇచ్చిన 12 గంటల బంద్ సంపూర్ణంగా జరిగింది. దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఉదయం 6 గంటల నుంచే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ప్రైవేటు బస్సులు రోడ్ల మీదకు రాలేదు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎల్‌డిఎఫ్ ర్యాలీలు నిర్వహించింది. నల్లధనం పేరుతో కేంద్రం సామాన్య ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కొడియేరి బాలకృష్ణన్ విమర్శించారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ హర్తాల్‌లో పాల్గొనకుండా, రాజ్‌భవన్‌కు ప్రదర్శన నిర్వహించడం ద్వారా నోట్ల రద్దుపై తన నిరసన వ్యక్తం చేసింది.కర్ణాటకలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు, ఇతర ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రాష్ట్ర విధానసభ, విధానమండలి పనితీరుపైనా ఈ ఆందోళనల ప్రభావం పడింది. పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాల బంద్‌కు మిశ్రమ స్పందన కనిపించింది. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ బంద్‌లో పాల్గొనకుండా కేవలం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. ఎల్‌డిఎఫ్ పాలిత త్రిపురలో బంద్‌తో సాధారణ జనజీవనం స్తంభించింది. విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడి ఉన్నాయి. బంద్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో అవి పనిచేశాయి. మహారాష్టల్రో కాంగ్రెస్, ఎన్‌సిపి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి.

పెద్దనోట్ల రద్దుపై సోమవారం హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల, షబ్బీర్‌అలీ, మల్లు భట్టి, సిపిఐ నేత నారాయణ తదితరులు