జాతీయ వార్తలు

కొత్త పెన్షన్ పథకం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 28: కేంద్రం ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సిపిఎస్)కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ఉపాధ్యాయ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఈ పథకాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి పిఆర్‌టియు ఉపాధ్యాయ సంఘం నుంచి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు థర్నాలో పాల్గొన్నారు. కాగా ఉపాధ్యయులు నిరసన కార్యక్రమానికి టిఆర్‌ఎస్ ఎంపీలు మద్దతు తెలిపారు. టిఆర్‌ఎస్ ఎంపీలు కె కవిత, బూర నర్సయ్యగౌడ్, నగష్, బాల్క సుమన్, ఎం మల్లారెడ్డి ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ సిపిఎస్ పథకం వల్ల అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేంద్రం తీసుకొన్న నిర్ణయం వల్ల తమకు భద్రత లేదనే భావన టీచర్లలో నెలకొందని ఆమె అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని ఆమె వెల్లడించారు. అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్తామని ఉపాధ్యాయులకు హమీ ఇచ్చారు. ఈ నిరసన కార్యక్రమానికి టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్ హాజరయ్యారు.

ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఉపాధ్యాయుల ధర్నాలో
మాట్లాడుతున్న టిఆర్‌ఎస్ ఎంపీ ఎం మల్లారెడ్డి