జాతీయ వార్తలు

బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జనవరి 4: కేంద్ర ఆర్థిక బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన జిఎస్టీ కౌన్సిల్ 8వ సమావేశంలో రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో మంత్రి ఈటల పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌లో ఈటల రాజేందర్ విలేఖరులతో మాట్లాడారు. ఈరోజు జరిగిన జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 99 శాతం సమస్యలు పరిష్కారం అయ్యాయని, ఇంకా రెండు అంశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతోందని వెల్లడించారు. పన్ను కట్టే ఒక డీలర్‌పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణ సరైనది కాదని, ఈ అంశంపై కేంద్ర వైఖరి స్పష్టం చేయాల్సి ఉందన్నారు. కోటిన్నరలోపు టర్నోవర్ కలిగిన డీలర్లను రాష్ట్ర పరిధిలోనే ఉంచాలని అన్ని రాష్ట్రాలు కోరుతున్నాయని చెప్పారు. చిరు వ్యాపారులు మీద కంటే పన్ను ఎగవేసే పెద్ద వ్యాపారులపైనే కేంద్రం దృష్టి పెట్టాలని కోరినట్టు చెప్పారు.బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగిన విధంగా కేటాయింపులు ఉండేలా చూడాలని బడ్జెట్ సన్నాహక సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరినట్టు ఆయన వెల్లడించారు. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచినందున, ఆయా జిల్లాల్లో వౌలిక వసతుల కోసం రెట్టింపు నిధులను కేటాయించాలని కోరినట్టు తెలిపారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతి ఆయోగ్ సిఫార్సులు మేరకు రూ.19,200 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్రాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి, తక్కువ వడ్డీకి రుణాలివ్వాలని సూచించినట్టు వివరించారు.