హైదరాబాద్

జిహెచ్‌ఎంసిని సందర్శించిన వారణాసి నగర నిగమ్ బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వారణాసి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్ నగరాన్ని సందర్శించింది. వారణాని నగర నిగమ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిప్రతాపసాహి నేతృత్వంలో ఎనిమిది అధికారులతో కూడిన బృందం అధ్యయనం నిమిత్తం నగరానికొచ్చింది. ఇందులో భాగంగా వారు మంగళవారం కమిషనర్ డా.బి. జనార్దన్ రెడ్డి కుందన్‌బాగ్ పార్కులో అధికారికంగా కల్సుకున్నారు. ఈ సందర్భంగా వారణాసి నగర నిగమ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిప్రతాప్‌సాహి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరం వారణాసి నగరంమని వివరించారు. ఈ నగరాన్ని చరిత్ర కన్నా పురాతన నగరం అని ప్రముఖ చిత్రకారుడు మార్క్‌ట్వైన్ పేర్కొన్నారని గుర్తచేశారు.
ఈ వారసత్వ నగరంలో పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వహణ, ఆస్తిపన్ను సేకరణ తదితర విషయాలపై పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టాల్సి ఉందని, ఈ విషయంలో ఉత్తమ విధానాలను అవలంభిస్తున్న హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధ్యయనం చేసేందుకు వచ్చినట్లు వెల్లడిం చారు. 85 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాసిలో 2001 జనాభా లెక్కల ప్రకిరం 12లక్షల జనాభా ఉందని, 1180 కిలోమీటర్ల అంతర్గత రహదారులున్నాయని ఆయన వివరించారు. ఆ తర్వాత కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు కోటి జనాభా ఉందని వివరించారు. ఈ నగరంలో ప్రతిరోజు సుమారు 4వేల మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఇంత భారీ ఎత్తన వచ్చే చెత్తను తడి, పొడి చెత్తగా వేర్వేరు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు.
ఇందులో భాగంగానే నగరంలోని 22లక్షల గృహాలకు గాను 44లక్షల డస్ట్‌బిన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ చెత్తను ప్రతి ఇంటి నుంచి సేకరించేందుకు వీలుగా 1500 ఆటో టిప్పర్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. నగరంలో ఉన్న 8వేల కిలోమీటర్ల పై చిలుకు రోడ్లున్నాయని, దీనికి తోడు 1900 కిలోమీటర్ల రోడ్ల రీకార్పెటింగ్ పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. నగరంలో రోడ్లపై ఏర్పడే గంతులు ఎప్పటికపుడు గుర్తించి వెంటనే మరమ్మతులు చేపడుతున్నట్లు తెలపారు. నగరంలో ఉన్న 1100 ఓపెన్ గ్యార్బెజీ పాయింట్లు పూర్తిగా తొలగించే ప్రయత్నాలు చేస్తున్నామన్నానరు. మరింత సమర్థవంతమైన పౌరసేవలను అందించడానికి ఐటి రంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. దేశంలోనే ఏ నగరంలో లేని ఈ ఆఫీసు ప్రక్రియను కూడా విజయవంతంగా నిర్వహిస్తున్న అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్‌ఎంసి అని కమిషనర్ వారణాసి బృందానికి వివరించారు. నగరంలో పట్టణ సాముదాయ అభివృద్ధి విభాగం ద్వారా మహిళలకు సాధికారత పెద్ద ఎత్తున చర్యలు చేపట్టడంతో పాటు నగర నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి, ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ సమావేశంలో వారణాసి నగర నిగమ్‌కు చెందిన అదనపు మున్సిపల్ కమిషనర్ బి.జె. ద్వివేది, సిఎఫ్‌వో శివేంద్రసింగ్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఎస్.ఇ.సింగ్, బన్స్‌రాజ్‌సింగ్, తివారి, వివేక్‌రాయ్‌లతో పాటు జిహెచ్‌ఎంసి అధికారులు కూడా ఉన్నారు.