హైదరాబాద్

ఓయూ శతాబ్ది ఉత్సవాల కోసం రూ. కోటితో ప్రత్యేక రోడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశంలోనే చారిత్రక విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన ఉస్మానియా యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల సంబరాల్లో జిహెచ్‌ఎంసి కూడా తనవంతు భాగస్వామ్యం వహించనుంది. ఈ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండగా, జిహెచ్‌ఎంసి కూడా ఏర్పాట్లలో తనవంతు పాత్రను పోషించనుంది. నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి కావటంతో జిహెచ్‌ఎంసి తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎన్‌సిసి గేటు నుంచి పోలీస్‌స్టేషన్ వరకున్న మెయిన్ రోడ్డును సుమారు కోటి రూపాయలతో అభివృద్ధి పరిచేందుకు జిహెచ్‌ఎంసి సిద్దమైంది. రోడ్డు నిర్మాణంలవో ఆధునిక పద్దతి అయిన క్రంబుల్ రబ్బర్ మాడిఫైడ్ బిటమిన్(సిఆర్‌ఎంబి) సాంకేతిక విధానాన్ని అవలంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రస్తుతం బీటి రోడ్డు వేయటానికి ఉపయోగిస్తున్న డాంబరులో వృథాగా ఉన్న నాలుగు చక్రాల బండ్ల టైర్ల మిశ్రమాన్ని కలిపి వేయనున్నట్లు తెలిపారు. నిరుపయోగంగా ఉన్న టైర్లను కరిగించి ప్రస్తుతం ఉపయోగిస్తున్న తార్‌లో ఈ టైర్ల ద్వారా 20 నుంచి 25 శాతం వ్యర్థాలను కలిపి రోడ్డ వేయనున్నారు. అయితే నగరంలో ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతున్నప్పటికీ బిటిలో ప్లాస్టిక్‌ను కలిపి రోడ్డు వేయటం ద్వారా ఒక్కోసారి ఈ ప్లాస్టిక్ రోడ్లపై వాహనాలు జరే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో ఉపయోగిస్తున్న టైర్ల వ్యర్థాలను కలిపి సేవే రోడ్లలో ఈ విధమైన ప్రమాదాలు జరిగే అవకాశాల్లేకపోవటం వల్లే అధికారులు ఈ విధానాన్ని అనుసరించనున్నారు. వర్షాకాలంలోనూ రోడ్డుపై నిలిచి నీరు రోడ్డు లోపలి భాగంలోకి ఇనకదు. ఫలితంగా రోడ్డు నీటి ద్వారా దెబ్బతినకుండా ఎక్కువ రోజులు అందుబాటులో ఉంటుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారా అయిన ఎన్‌సిసి గేటు నుంచి ఉమెన్స్ హాస్టల్, లా కాలేజీ, ఆర్ట్స్ కాలేజీ మీదుగా యూనివర్శిటీ పోలీస్‌స్టేషన్ వరకు ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా దాదాపు తుది దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అంతేగాక, ఈ రోడ్డుపై మరో పనె్నండున్నర లక్షల రూపాయల వ్యయంతో లేన్ మార్కింగ్ పనులను కూడా చేపట్టారు. ఇవే కాకుండా జిహెచ్‌ఎంసి పారిశుద్ద్య విభాగం సిబ్బంది ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ప్రధాన రహదార్లతో పాటు ఇతర ప్రాంతాల్లోని పారిశుద్ద్య కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

మలేరియా నివారణే లక్ష్యం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 24: గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని మలేరియా రహితమైన సిటీగా తీర్చిదిద్దేందుకు దోమల నివారణ కార్యక్రమాలు మరింత ముమ్మరం కానున్నాయి. దీనిలో భాగంగా మంగళవారం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో అన్ని సర్కిళ్ల పరిధుల్లో దోమల నివారణ, మలేరియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిహెచ్‌ఎంసి చీఫ్ ఎంటమాలజిస్టు వెంకటేశ్ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్‌తో ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటామని, ఈసారి ‘ఎండ్ మలేరియా ఫర్ గుడ్’ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గడిచిన దశాబ్దపు కాలం నుంచి జిహెచ్‌ఎంసి మలేరియా నివారణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించిందని వివరించారు. ఇందులో భాగంగా 2007 వరకు 239 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నుంచి 2016 వరకు 124 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఈ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని సర్కిళ్లలో మలేరియా అవగాహన ర్యాలీలు, స్వయం సహాయక బృందాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లతో కలిసి విద్యా సంస్థల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం ఫైడే ఈజ్ డ్రైడేగా పాటించేలా ప్రజల్లో అవగాహనను పెంపొందిస్తామని పేర్కొన్నారు. నీటిని నిల్వ చేసుకునే ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేలా, సంప్‌లు, డ్రమ్‌లను, కూలర్, పూల కుండీలు, ఫ్రిజ్‌లను ఎప్పటికపుడు శుభ్రంగా ఉంచుకుంటే దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయని తెలిపారు.