జాతీయ వార్తలు

తెలంగాణకు అదనపు పశుగ్రాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఏప్రిల్ 26: తెలంగాణకు అదనపు పశుగ్రాసం పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు.గ్ మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో దేశంలో నెలకొన్న కరువుకు సంబంధించిన ప్రశ్నకు బదులిస్తూ ఆయన ఈ విషయం చెప్పారు. టిఆర్‌ఎస్ సభ్యుడు బి.వినోద్‌కుమార్ ఆడిగిన ఒక అనుబంధ ప్రశ్నకు ఆయన బదులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కరువు నివేదిక ప్రకారం హెచ్‌ఎల్‌సి ఆమోదించిన నిధులను విడుదల చేశామని తెలిపారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధులను కూడా మార్చి నాటికే రాష్ట్రానికి పంపించి వేశామని రాధామోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఎడ్వాన్స్‌మెంట్ మొదటి విడత నిధులు కూడా తెలంగాణకు విడుదల చేశామని ఆయన వెళ్లడించారు. తెలంగాణకు పశుగ్రాసం పంపించేందుకు మధ్యప్రదేశ్‌తో చర్చలు జరుపుతున్నామని రాధామోహన్ సింగ్ చెప్పారు. తెలంగాణలో కరువు నెలకొనటంతోపాటు తీవ్ర మంచి నీటి కొరత ఏర్పడిందని వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 450 మండలాలుంటే ఇందులో దాదాపు డెబ్బై శాతం మండలాల్లో కరువు నెలకొన్నదని ఆయన చెప్పారు. కృష్ణ, గోదావరి నదులపై రాష్ట్రంలో ఉన్న పద్నాలుగు ప్రధాన రిజర్వాయర్లు దాదాపుగా ఎండిపోయాయని వినోద్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు సహాయం కింద 3064 కోట్ల ఆర్థిక సహాయం కోరగా కేంద్ర ప్రభుత్వం 791 కోట్ల సహాయం ప్రకటించి ఇందులో 400 కోట్లు మాత్రమే విడుదల చేసిందని ఆయన విమర్శించారు. తాగునీటి పథకాల కోసం తమ ప్రభుత్వం 555 కోట్లు కోరితే 72 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని వినోద్‌కుమార్ విమర్శించారు.