హైదరాబాద్

రూ. 10 కోట్లతో చిట్ ఫండ్ వ్యాపారిపరార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: అధిక వడ్డీతో ప్రజలను నమ్మిస్తూ, చీటీలు నిర్వహిస్తున్న ఓ వ్యాపారి చిట్టీల సొమ్ముతో ఉడాయించిన సంఘటన నేరెడ్‌మెట్ డిఫెన్స్ కాలనీలో చోటు చేసుకుంది. అధిక కమిషన్ వస్తుందంటూ కొనే్నళ్లుగా చిట్స్ నిర్వహిస్తున్న స్థానిక వ్యాపారి అరుణారెడ్డి, ప్రజల నుంచి చిట్స్ పేరుతో సేకరించిన రూ. 10 కోట్లతో ఆమె భర్త రఘునాథ్ రెడ్డి ఆదివారం ఉదయం కనిపించకుండా పోయారు. ప్రజల సొమ్ముతో ఉడాయించిన వారి విషయం తెలుసుకున్న బాధితులు అరుణారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు నేరెడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల
పదవీవిరమణ పెంపుపట్ల హర్షం
ముషీరాబాద్, మే 1: ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు పెంచుతూ అంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం పట్ల జిల్లా గ్రంథాలయ సంస్థల గ్రంథాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. ఈమేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోలుగల్లు కమ్మన్న ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర చైర్మన్, కార్యదర్శులకు కృతజ్ఞతలు తెలిపారు.