జాతీయ వార్తలు

ఒడిశా ముఖ్యమంత్రితో పోలవరంపై చర్చించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏపి సిఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి ఉమాభారతి సలహా

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యల గురించి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో చర్చలు జరపాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు హితవుచెప్పారు. ఒడిశాకు చెందిన బిజెడి సభ్యుల బుధ, గురువారాలు పార్లమెంటు ఉభయ సభల్లో పోలవరం నిర్మాణం, గిరిజనులు సమస్యలను ప్రస్తావించారు. లక్షలాది మందిని నిరాశ్రయులను చేస్తున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని వారు ఉభయ సభల్లో నిలదీశారు. ఉమాభారతి దీనిపై పార్లమెంటు ఆవరణలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకముందే ఒడిశా ప్రభుత్వం, గిరిజనులు ప్రస్తావిస్తున్న సమస్యలను పరిష్కరించుకోవటం మంచిదని అన్నారు. చంద్రబాబు ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి అతనీ సమస్యలను వీలున్నంత త్వరగా పరిష్కరించుకుంటారనే పూర్తి విశ్వాసం తనకు ఉందని మంత్రి తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో మట్లాడమని తాను ఇదివరకే చంద్రబాబుకు తెలిపానని మంత్రి వెల్లడించారు. అవసరమైతే తాను కూడా నవీన్ పట్నాయక్‌తో మాట్లాడతామని ఉమాభారతి భరోసా ఇచ్చారు.
పోలవరంపై బిజెడి ఆందోళన
గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన పోలవరం ప్రాజెక్టుపై రాజ్యసభలో బీజూ జనతాదళ్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసింది. రాజ్యసభలోకాంగ్రెస్ సభ్యులు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకుంటున్న దశలో బిజెడి సభ్యులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల ఒడిశా తీవ్రంగా నష్టపోతుందని ఆరోపించారు. చత్తీస్‌గఢ్ అభ్యంతరాలను సైతం ఖాతరు చేయకుండా ఏపి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్డును నిర్మిస్తోందని బిజెపి ఎంపీలు ధ్వజమెత్తారు. కేంద్రం ఈ వివాదాన్ని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకోకపోతే ఒడిశా, చత్తీస్‌గఢ్‌లు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు.