ఉత్తరాయణం

పాకిస్తాన్ లేకి బుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత మాజీ నౌకాదళ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ని అపహరించి, గూఢచర్యం కేసు బనాయించి, సైనిక కోర్టులో విచారించినట్టు నటించి, చివరకు మరణశిక్ష ఖరారు చేస్తున్నట్లు ప్రకటించిన పాకిస్తాన్ ఆయన, వారి కుటుంబ సభ్యులతో కలిసే సందర్భాన్ని అతి తెలివితే పాడు చేసింది. అంతర్జాతీయ సమాజం ఏర్పరచుకున్న, ఆయా సందర్భాలలో పాటించాల్సిన కనీస మర్యాదల్ని తన లేకి ప్రవర్తనతో ఉపేక్షించింది. పాకిస్తాన్‌కి ఒకటే ధ్యాస. భారత్ కూడ తనలాగే ఉగ్రవాదానికి వంతపాడే దేశమని అందర్నీ నమ్మించాలి. తాను సకల సాక్ష్యాలతో దొంగగా దొరికిన ప్రతిసారీ భారత్‌పై బురదజల్లాలి. అందులో భాగమే జాదవ్‌ని ‘తమ దేశంలో తీవ్రవాదాన్ని ప్రోది చేస్తున్న భారత గూఢచారి’గా ముద్రవేయడం, ఆయనకు అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రకారం ఇవ్వాల్సిన న్యాయసహాయం గానీ, కాన్సుర్ యాక్సిస్ గానీ ఇవ్వకుండానే మరణశిక్ష ఖరారు చేసింది. భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదించబట్టి, మరణశిక్ష ఖరారు చేసింది. భారత్ అంతర్జాతీయ న్యాయస్థానంలో సమర్థవంతంగా వాదించబట్టి, మరణశిక్ష నిలుపుదల ఉత్తర్వులను సాధించబట్టి, తన దుందుడుకు చర్యని వాయిదావేసింది. అయితే తన చిన్నబుద్ధిని దాచుకోలేకపోయింది. 22 మాసాల తర్వాత తల్లినీ, భార్యనీ కలిసే అవకాశం ఇచ్చినప్పుడు వారిని అద్దాల గోడలకి అటూఇటూ నిలబెట్టడం శాడిజం. ఆ సందర్భంలో తల్లి వేసుకున్న గాజులూ, బొట్టు, తాళివంటి వాటికి కూడా అభ్యంతరం చెప్పడం అవమానించడానికే. ఇలాంటి చర్యలవల్ల ఆ దేశం బాధించి శునకానందం పొందడం మినహా బావుకున్నదేమీ లేదు. అలా అని భారత్ ఈ ఉదంతాన్ని తేలిగ్గా తీసుకోడానికీ లేదు. కక్షపూరిత వైఖరికి జాధవ్ బలికాకుండా భారత్ తన దౌత్య ప్రయత్నాల్ని కొనసాగించాలి. పాక్‌పై అంతర్జాతీయ సమాజం ద్వారా ఒత్తిడి పెంచాలి. అంతర్జాతీయ న్యాయస్థానంలో సంబంధిత కేసు గెలిచే పూర్తి ప్రయత్నాలు చెయ్యాలి.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఫోన్లలో సమాచారం ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల పలు ఉద్యోగాల కోసం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలను ఇంటర్‌నెట్‌లో అందుబాటులో ఉంచింది. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్‌నెట్‌లో ఆ సమాచారాన్ని చూసుకునే వెసులుబాటు తక్కువ. అందువల్ల మార్కుల వివరాలు, ఇంటర్వ్యూలు, ఇతర సమాచారాన్ని వారివారి మొబైల్ ఫోన్‌లకు సంక్షిప్త సమాచారం అందిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. నిరుద్యోగులకు సకాలంలో సమాచారం అందడం వల్ల వారు అప్రమత్తమై తదుపరి అడుగులు వేస్తారు.
-కె.రంగలక్ష్మి, రాయలచెరువు
సినీతారలు మాట ఇవ్వాలి
తెలుగుభాషకు ప్రాధాన్యం ఇస్తామని తెలుగు సినీరంగానికి చెందిన తారలు మాట ఇవ్వాలి. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వేదికపై మన సినీ ప్రముకులు అలరించారు. ఆ సందర్భంగానైనా తెలుగు సినిమాల్లో పాటలన్నీ పూర్తిగా తెలుగులోనే ఉంటాయన్న ప్రతిజ్ఞ చేయించి ఉంటే సముచితంగా ఉండేది. అలా చేయకుండా ఊరికే గుండెలు బాదుకోవడంవల్ల జరిగేది ఏమిటి?
-ఉపాధ్యాయుల శ్రీరామచంద్రమూర్తి, తొర్రిపాడు అగ్రహారం