ఉత్తరాయణం

అనుసంధానం మంచిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ‘ఫేస్‌బుక్’ కొత్తగా ఖాతాలు తెరిచే వినియోగదారుడి ఆధార్ సంఖ్యను పేర్కొనాలన్న నిబంధన వల్ల నకిలీ అకౌంట్ల గుట్టు రట్టవుతుంది. రక్షణ లభిస్తుంది. అయితే దీనిపై కొంత విమర్శలున్నాయి. వ్యక్తిగత వివరాలకు రక్షణ లభించదన్న ఆందోళన ఉంది. అయితే ఇది అనుసంధానం కాదు. వివరం చెప్పడం మాత్రమేనని, అది కూడా ఐచ్ఛికమేనని పేర్కొంది. వినియోగదారులు ఈ విషయంలో ఆధార్ సంఖ్యను పేర్కొనడం వల్ల బోగస్ వినియోగదారుల ఆటకట్టించవచ్చు.
-బి.మధుసూదన్,
బేతంచర్ల
అందరికీ
ఒకే చట్టం
స్వాతంత్య్రం వచ్చాక ప్రాంతీయ, కుల, మత వర్గాలుగా ప్రజల్లో తేడా వచ్చింది. రిజర్వేషన్ల వంటి ఆ దూరాన్ని మరింత పెంచాయి. ప్రజలను విభజించి పాలించే విధానాలు ఎక్కువయ్యాయి. ఇప్పటికైనా నాయకులు, చట్టసభల ప్రతినిధుల ఆలోచనాసరళిలో మార్పులు రావాలి. దేశంలో అన్ని ప్రాంతాల్లోను అన్ని అంశాలలోను ఒకే విధానం ఉండాలి. ముఖ్యంగా రిజర్వేషన్ల వ్యవహారంలో. కుల, మత ప్రస్తావన లేని విధానాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి.
-జి.శ్రీనివాసులు, అనంతపురం