ఉత్తరాయణం

కొంత భరోసా.. కొంత నిరాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ యేడు ఆర్థిక సర్వే ఫలితాలు చూస్తే రోగితో వైద్యుడు ‘ఏం ఫర్వాలేదు, అంతా సర్దుకుంటుంది’ అన్న తరహాలో ఉన్నాయి. వైద్యుడి మాటలతో భరోసా కలిగినా, ఇదంతా తనకి ధైర్యం చెప్పడంలో భాగమే కదా అన్న అనుమానమూ అతడికి వదలదు. ఆర్థిక సర్వే ఈ సంవత్సరం స్థూల జాతీయోత్పత్తి 6.5 శాతంగా ప్రకటించి, వచ్చే యేడు 7 నుండి 7.5 శాతంగా ఉండొచ్చని, తద్వారా ప్రపంచంలో త్వరితంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న దేశంగా తిరిగి కొనసాగగలదని ఆశాభావం వెలిబుచ్చింది. పెరిగిన పరోక్ష పన్నులు చెల్లించేవారి సంఖ్య, ఎగుమతులు, విదేశీ పెట్టుబడులను ఆర్థిక పుష్టికి కారణంగా చూపింది. అయితే వ్యవసాయ రంగానికి, విద్య, ఉపాధి రంగాలకు చెయ్యాల్సిన మేలును కూడా గుర్తు చేసింది. ఈ మధ్యనే విడుదలైన ఆక్స్‌ఫామ్ సంస్థ నివేదిక ప్రకారం గత సంవత్సరంలో సంపదలో 73 శాతం ఒక్కరి వద్దే పోగుపడగా దేశ జనాభాలో సగం మంది కేవలం ఒక్కశాతయం ఆదాయాభివృద్ధి చూడగలిగారు. లెక్కలు కచ్చితంగా ఇవే కాకపోవచ్చు కానీ ఆదాయం పంపిణీ సరళి ఎలా ఉందో తెలియచేస్తోంది. కోట్లాది పేదల జీవనాన్ని ఏమాత్రం మెరుగుపర్చలేని అభివృద్ధి ఆరోగ్యకరం కాదు. అసమానతలను తగ్గించేలా ప్రభుత్వం ఆలోచించాలి. అధిక జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగం వివిధ కారణాలతో కుదేలై ఉండడం సర్వే గుర్తించింది. కనుక ఆ రంగం మెరుగుపడి, తద్వారా దేశ ఆర్థికపుష్టికి ఊతమిచ్చేలా చర్యలు ఉండాలి. యువశక్తి అధికంగా ఉన్న దేశంలో విద్య, కౌశలాలు, ఉద్యోగాల సృష్టిలో ముందుండడం ద్వారానే ఫలితం ఉంటుంది. ఈ విషయాల్లో ఎంత వెనుకబడి ఉన్నామో వివిద సర్వేలు పట్టి చూపిస్తున్నాయి. విదేశీ పెట్టుబడులు, ఎగుమతుల్లో వృద్ధి సాధించడం అన్నది మన దేశం చేసే ప్రయత్నంతోబాటు పై దేశాల విధానాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి పరిణామాలూ, ఆయిల్ ధరలూ, వాటిపై అప్పటికప్పుడు స్పందించడం తప్ప చేసేదేమీ లేదు. ఒక ఆశావహ దృక్పథంతో స్థిరమైన, సమగ్రమైన ఆర్థికాభివృద్ధి సాధించడానికి వెసులుబాటు ఉంది అన్న నమ్మకంతో ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ఈ సర్వే దారి చూపుతుంది. అవకాశం సద్వినియోగపర్చడం ప్రభుత్వం చేతిలో ఉంది.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

మేడారం జాతరకు ఈ-హుండీ అవసరం

దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణలోని మేడారం అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతరకు దాదాపు 1.5 కోట్ల మంది భక్తులు హాజరవుతారు. ప్రత్యక్షంగా మేడారం వెళ్లే భక్తులు కానుకలు చెల్లించుకునే వెసులుబాటు ఉంది. అయితే అక్కడకు వెళ్లలేనివారు ఆన్‌లైన్‌లో విరాళాలు, మొక్కులు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తే బాగుండేది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో వెబ్ ఆప్షన్ ఆవిష్కరించి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తే మంచిది.
-సి.వి.ఆర్.కృష్ణ, హైదరాబాద్