ఉత్తరాయణం

ఇసుక లారీల ప్రమాదాలకు అంతం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇసుక లారీల ప్రమాదాలు నిత్యం పెరిగిపోతుండడంతో వాహనదారులు ప్రధాన రహదారి మీదకు రావాలంటేనే జంకుతున్నారు. జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం క్వారీ నుండి ఇసుక లారీల ద్వారా హైదరాబాద్‌కి తరలివెళుతుంది. నిత్యం సుమారు అయిదువేల లారీలు ఇసుకను రవాణా చేస్తున్నాయి. ఇసుక లారీల డ్రైవర్లు మద్యం సేవించడం, ఓవర్‌టేకింగ్ చేయడం, మితిమీరిన వేగంతో నడపడంవల్ల రోడ్డుమీద వెళ్ళే వారి ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వారం రోజుల క్రితం మోరంచపల్లి గ్రామంలో బైక్‌పై వెళ్తున్న ప్రైవేట్ అధ్యాపకుడి దంపతులమీదికి లారీ దూసుకువెళ్ళడంతో అధ్యాపకుడు రవీందర్ ప్రాణాలు కోల్పోగా, వారి భార్య చావుబతుకులమధ్య కొట్టుమిట్టాడుతూ కోమాలోకి వెళ్లింది. లారీలను నిలుపుదల చేయాలని ఆయా గ్రామాల ప్రజలు, కాలేజీ విద్యార్థులు, వివిధ పార్టీల నాయకులు పది గంటల పాటు ధర్నా చేయడంతో సుమారు 20 కి.మీ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు జోక్యం చేసుకొని మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామనడంతో ధర్నా విరమింపజేశారు. తాజాగా గణపురం మండలం కుందయ్యపల్లి గ్రామం వద్ద రోడ్డుపై వెళ్తున్న బిల్ల మల్లారెడ్డి అనే పేద రైతుపై ఆదివారం రాత్రి ఇసుక లారీ దూసుకెళ్ళడంతో అక్కడికక్కడే మరణించాడు. వేరే వ్యక్తికి కూడా గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారం రోజుల లోపే రెండు ప్రమాదాలు జరిగి ఇరువురు మరణించడం మూలాన ఇసుక లారీలను మొత్తానికే నిలుపుదల చేయాలని మళ్లీ ధర్నాకు ఉపక్రమించి ఆవేశంతో ప్రజలు లారీల అద్దాలను ధ్వంసం చేశారు. అన్ని పార్టీలు సుమారు 20 గంటలపాటు ధర్నా నిర్వహించారు. మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని, మృతుని కుమారుడికి ఉద్యోగం కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. ఇసుక లారీలకు తోడు అధిక లోడ్‌గల బూడిద లారీలు, బొగ్గు లారీలు కూడా రహదారి మీదనే ప్రయాణిస్తుండడంతో ద్విచక్రవాహనదారులు, కార్లు, ఇతర వాహనాలలో ప్రయాణించేవారు బెంబేలెత్తుతున్నారు. కాళేశ్వరం నుండి హైదరాబాద్ వరకు ప్రధానహదారిపైనగల పల్లెలు, పట్టణాలలోని ప్రజలు ఇసుక లారీల దూకుడుకు భయకంపితులై బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాఠశాలలకు వెళ్తున్నారు. రవాణా శాఖ అధికారుల తనిఖీలు లేకపోవడం, పోలీసుల నిర్లక్ష్యం, రోడ్డుపై స్పీడు బ్రేకర్లు లేకపోవడం, లారీ క్లీనర్స్‌కూడా వాహనాలను నడపడం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇసుక లారీలను రాత్రివేళల్లో మాత్రమే రోడ్లపైకి అనుమతించాలి. బ్రీత్ ఎనలైజర్‌తో డ్రైవర్లను పరీక్షించాలి. ప్రధాన రోడ్డుపై ఒక వరుసక్రమంలో లారీలు వెళ్ళేలా ఏర్పాటుచేయాలి. ప్రభుత్వం కూడా ఇసుక లారీల ద్వారా ఆదాయం వస్తుందని చూస్తోంది తప్ప అమాయక ప్రజల ప్రాణాలను పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించాలి.
- కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట