ఉత్తరాయణం

ఉపద్రవాన్ని పసిగట్టలేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్, చైనాల ప్రోత్సాహంతో బంగ్లాదేశ్ నుంచి అసోంలోకి అక్రమ వలసలు పెరుగుతున్నాయనీ, ఫలితంగా ఆ రాష్ట్రంలో రాజకీయ పార్టీల బలాబలాల్లో మార్పు వస్తుందని మన సైన్యాధిపతి బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై కొన్ని రాజకీయ పార్టీలు రాద్ధాంతం చేయాల్సిన పనిలేదు. సైన్యాధిపతిగా, బాధ్యతగల పౌరుడిగా దేశ భద్రత దృష్ట్యా రాబోయే ఉపద్రవం గురించి ఒక హెచ్చరికగా దీన్ని భావించాలి గాని రాజకీయ కోణంలో చూడకూడదు. అక్రమ వలసలతో స్థానికుల ప్రాబల్యం, వారికి ఉపాధి అవకాశాలు తగ్గిపోవడమే గాక అక్రమ వలసదార్లు ప్రజా స్రవంతిలో కలువలేక స్థానికులతో సంఘర్షణలు జరగటం ఎన్నో దేశాల్లో చూస్తున్నాం. (మైన్మార్‌లో రోహింగ్యాల ఘర్షణల వంటివి) అక్రమ వలసలతో రాజకీయ పార్టీల బలాబలాలే కాదు, ఆర్థిక స్థితి కూడా దెబ్బతింటుంది. గతంలో బంగ్లాదేశ్ విమోచన సమయంలో లక్షలాది మంది పశ్చిమబెంగాల్‌లో ప్రవేశించటం, అధిక శాతం ఇక్కడే స్థిర పడటంతో ఆ రాష్ట్ర అభివృద్ధి ఘోరంగా కుంటుపడింది. అప్పుడు దేశ ప్రజలపై అదనపు పన్నుల భారం వడ్డించారు. నేటికీ బెంగాల్ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. ఇప్పుడు వెనుకబడ్డ అసోం కూడా అక్రమ వలసలతో అవస్థ పడుతోంది. మరోవైపు సంస్కరణలు జరిగినా దేశంలో ఆర్థిక అసమానతలు, అవినీతి, అక్రమాలు, అశాంతి, అభద్రతా భావం ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. (పేదదేశంగా వున్నప్పుడే ప్రశాంతంగా వుండేది)
కనుక సైన్యాధిపతి వ్యాఖ్యలను ఒక హెచ్చరికగా భావించి అన్ని రాజకీయ పార్టీలు వాస్తవ పరిస్థితులను తెలుసుకొని భవిష్యత్తులో దేశానికి ఏర్పడబోయే ముప్పు దృష్ట్యా అక్రమ వలసల నిరోధానికి, తిష్టవేసిన చొరబాటుదార్లను గుర్తించి వారిని స్వదేశాలకు పంపే సూచనలతో ప్రభుత్వంపై వత్తిడి తేవాలి. కేంద్రం కూడా అంతర్జాతీయ సరిహద్దుల వద్ద భద్రతా బలగాలను, ఆధునిక ఆయుధ సంపత్తిని, నిఘా వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా పెంచి అక్రమ వలసలకు కళ్లెం వేయాలి.
- తిరుమలశెట్టి సాంబశివరావు, నర్సరావుపేట
ప్రమాద ఘంటికలు
అంతర్గతంగాను, సరిహద్దుల్లోను భద్రత పెను సవాళ్లు విసురుతున్నా మన పాలకులు ఏ మాత్రం స్పందించడం లేదు. భద్రతా వ్యవస్థ నానాటికీ దిగజారుతూ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ సమస్య ఇంకా రగులుతూనే ఉంది. పాలకులు నిత్యం ఎన్నికలపై తప్ప, చిరకాల సమస్యలపై దృష్టి సారించడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా మారుతున్నా, మత మార్పిడులు యథేచ్ఛగా జరుగుతున్నా పాలకులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. నేపాల్, భారత్ భూభాగాల్లోకి చైనా చొచ్చుకొని వస్తున్నా రాబోయే ప్రమాదాన్ని ప్రభుత్వం గమనించడం లేదు. ఇప్పటికే ‘సూపర్ పవర్’గా చైనా ఆవిర్భవించింది. ఇంకా అలసత్వం ప్రదర్శిస్తే- ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు’ ఆ తర్వాత విచారించ వలసి వస్తుంది.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

అలంకారప్రాయంగా ఏటిఎంలు
గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా ఏటిఎంల వద్ద నగదు జాడ కనిపించడం లేదు. ‘నో క్యాష్’ బోర్డులతో ఏటిఎంలు అలంకారప్రాయంగా మిగిలాయి. జనం ఇక్కట్లను బ్యాంకు యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. బ్యాంకు కౌంటర్లలో పదివేల రూపాయలకు మించి నగదు ఇవ్వడం లేదు. దీంతో వినియోగదారుల అవస్థలు వర్ణణాతీతంగా ఉన్నాయి. పెళ్లిళ్లు, ప్రయాణాలు, ఆస్పత్రి ఖర్చులు, ఇంటి అవసరాలకు నగదు లభించక పోవడంతో జనం అసహనానికి లోనవుతున్నారు. పెద్దనోట్ల రద్దు సమయంలో ఎదురైన కష్టాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. నగదు కొరతపై ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదు. నగదు లేకుండా చేస్తే నగదు రహిత లావాదేవీలు పెరుగుతాయా? గ్రామీణ ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలు పడి సమీప పట్టణాలకు వచ్చి నగదు లభించక పోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు