ఉత్తరాయణం

విశ్రాంత ఉద్యోగుల పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కుటుంబ పించనుదార్ల నుండి జీవిత ధ్రువపత్రాల స్థానంలో వేలిముద్రలను తీసుకొనే విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత ఏడాది నవంబరు నుంచి సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో వేలిముద్రలను సేకరిస్తున్నారు. అయితే వృద్ధాప్యం కారణంగా చాలామంది వేలిముద్రలు సరిగా పడడం లేదు. ఈ నెలాఖరు లోగా వేలిముద్రల సేకరణ పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. వేలిముద్రలు పడనివారి నుంచి ఐరిష్ తీస్తామని ట్రెజరీ అధికారులు చెపుతున్నారు. ఐరిష్‌ను తీసేందుకు యంత్రాలను మాత్రం ట్రెజరీలకు ఇంతవరకూ అందజేయలేదు. దీంతో పెన్షన్లు అందక రిటైర్డ్ ఉద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఇకనైనా ఐరిష్ యంత్రాలను ట్రెజరీలకు సరఫరా చేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు
రాజ్యాంగం మార్చడం సులభమా?
భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేసేందుకు అధికార బిజెపి కుట్ర పన్నుతోందని ఇటీవల బిఆర్ అంబేద్కర్ మనవడు ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు కుట్రలతో రాజ్యాంగాన్ని మార్చటం సాధ్యమా? అలా చేయాలంటే పార్లమెంట్ ఉభయ సభలలో మూడింట రెండొంతుల మెజారిటీతో తీర్మానాలను ఆమోదించాలి. ప్రస్తుతం బిజెపికి రాజ్యసభలో తగినంత మెజార్టీ లేదు. ఈ పరిస్థితులలో రాజ్యాంగాన్ని అధికార పార్టీ నేతలు ఎలా మారుస్తారు? రాజకీయ దురుద్దేశంతో రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ కొందరు ఇలా ప్రచారం చేయడం సరికాదు. నిబంధనల ప్రకారం అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని మార్చడం తప్పు కాదు. ఇప్పటికే మన రాజ్యాంగాన్ని ఎన్నోసార్లు మార్చారన్న విషయాన్ని ఆ నేతలు గమనించాలి.
- సౌందర్య, కాకినాడ
వ్యతిరేక ఓటుతోనే గెలుపు
అధికార పార్టీల అవినీతి విధానాలకు నిరసనగా విపక్ష పార్టీలవైపు ఓటర్లు మొగ్గు చూపడం మనదేశంలో కొత్తేమీ కాదు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలకు విసుగెత్తిన జనం 2014లో బిజెపికి అఖండ విజయాన్ని అందించారు. అదే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. అయితే కేంద్రంలో మోదీ, ఏపీలో చంద్రబాబు పాలన ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉంది. దీంతో విసుగెత్తిన ఓటర్లు వచ్చే ఎన్నికల్లో తమ వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశం ఉంది. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి వల్ల మోదీ ప్రభుత్వంపై నిరసన పెల్లుబుకుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీలకు ఎదురదెబ్బ తగిలే అవకాశముంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీని జనం ఆదరిస్తున్నప్పటికీ పాలనలో మార్పు కన్పించడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో రాజకీయ పార్టీలు లాభపడుతున్నాయి. కానీ ఏ పార్టీ అధికారం చేపట్టినా తమకు ఒరిగేదేమీ లేదని జనం నిరాశ పడుతున్నారు.
- నుగ్గు జనార్దన, జమ్మలమడుగు
ఆలింగనం హిందూ సంస్కృతి
విదేశీ నేతలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలింగనం చేసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరచూ అపహాస్యం చేస్తున్నారు. వంగ్యోక్తులను జోడించి రాహుల్ ట్విట్టర్‌లో మోదీపై విమర్శలు సంధిస్తున్నారు. ఇది నిజంగా కుర్రతనపు చేష్ట. వందేళ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ తన స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదు. కరచాలనం చేయడం విదేశీ పద్ధతి. ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం, నమస్కరించడం హిందూ సంస్కృతి. హిందువులను, హిందూ పద్ధతులను నెహ్రూ కుటుంబం ఏనాడూ గౌరవించలేదు. ఆ మనస్తత్వానే్న రాహుల్‌లో ఇపుడు మనం చూస్తున్నాం.
- కె.సుభాష్, కాకినాడ