ఉత్తరాయణం

ప్రజా సమస్యల్ని చర్చించని పార్లమెంటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఏ చర్చా లేకుండా ప్రతిరోజూ తుడిచిపెట్టుకుపోతుండడం బాధాకరం. 2009 నుండి జరుగుతున్న సెషన్స్‌లో అత్యల్ప పనితీరు ప్రదర్శించిన సమావేశాలుగా ఈసారి సమావేశాలు రికార్డు సృష్టించడం అధికార, ప్రతిపక్షాలు ఉమ్మడి నిర్వాకం. పార్లమెంటులో వివిధ పక్షాల్ని సమన్వయం చేసి చర్చలు జరగడానికి బాటలు పర్చాల్సిన అధికార పక్షానికి ఈ పాపంలో పెద్ద వాటా దక్కుతుంది సహజంగానే. బడ్జెట్ సమావేశాల్లో కేటాయించిన ప్రతి పైసాపై పూర్తి స్థాయి చర్చలు జరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రభుత్వం తప్పొప్పుల్ని ప్రతిపక్షాలు నిలదీస్తే, వారికీ లాభం, ప్రజలకీ లాభం. ఆ దిశగా ఆలోచించాల్సిన ప్రతిపక్షం ఇతోధికంగా సమావేశాలు వాయిదా పడే అవకాశాల్ని మెరుగుపరుస్తూ ప్రభుత్వం నెత్తిన పాలు పోస్తోంది. ఈసారి తెరాస తీరు ప్రత్యేకం. తెరాస అధినేత ప్రత్యేక విమానంలో కోల్‌కత వెళ్లి మమతా బెనర్జీని కలిసి బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపారు. వా ఎంపిలు అదే బిజెపి పాలనకు వ్యతిరేకంగా పార్లమెంటులో రావాల్సిన అవిశ్వాస తీర్మానం రాకుండా పోయేందుకు పరోక్షంగా దోహదపడ్డారు. బిజెపిని నిలదియ్యడమే తెరాస లక్ష్యమైతే అవిశ్వాస తీర్మానంపై చర్చ కన్నా మంచి అవకాశం ఎక్కడ దొరుకుతుంది? ఆ తీర్మానం కోసం పట్టుపట్టిన ఆంధ్రప్రదేశ్ పార్టీలుగాని, ఆ తీర్మానం వస్తే తగిన జవాబుకి సిద్ధమంటున్న అధికార పార్టీగానీ తమల్ని సంప్రదించినా, సంప్రదించకపోయినా వారు ఆ దిశగా ప్రయత్నించాల్సింది. అప్పుడు తెరాస అధినేత ప్రయత్నాలకు విశ్వసనీయత దక్కేది. ఎవరి ప్రయోజనాలు నెరవేరడం ఎలా వున్నా, ప్రజా ప్రయోజనాలు మాత్రం దారుణంగా వంచింపబడుతున్నాయి పార్లమెంటు వాయిదాలతో.
-డా డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం