ఉత్తరాయణం

కీలకపాత్ర ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మనమే కీలకం. వచ్చే ఎన్నికల తర్వాత ప్రధాని ఎంపికలో మన పార్టీదే ప్రధాన పాత్ర’ అన్న ఏపీ సీఎం చంద్రబాబు ఆత్మవిశ్వాసం మెచ్చదగినదే. కానీ, పరిస్థితులను విశే్లషణ చేస్తే అది జరిగే పనికాదనిపిస్తోంది. ఎందుకంటే బాబు కన్నా ముందే తెలంగాణ సీఎం కేసీఆర్ మేల్కొని ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. వీరిద్దరూ కాంగ్రెస్, భాజపా లేని కూటమి అంటున్నా- ప్రధాని పదవిపై మోజు ఉన్న శరద్‌పవార్, మమతా బెనర్జీలు కాంగ్రెస్‌తోనే పొత్తు అంటున్నారు. వామపక్షాలు సైతం కాంగ్రెస్‌తో కూటమి అంటున్నాయి. ఇంక బాబు,కేసీఆర్‌లకు మద్దతునిచ్చే బలమైన ప్రాంతీయపార్టీ లేవి? వాటి సాయంతో ‘కీలక పాత్ర’ పోషించడం సాధ్యమా?
- జ్ఞానబుద్ధ, కాకినాడ
న్యాయవ్యవస్థలో జోక్యం తగదు
కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నది. ఆ జోక్యాన్ని సాగనివ్వం అంటున్న కాంగ్రెస్ పార్టీ సుప్రీం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం కోర్టు వ్యవహారాల్లో తలదూర్చడం కాదా? మిగిలిన న్యాయమూర్తుల్ని హెచ్చరించడం కాదా? అభిశంసన నెగ్గదని తెలిసినా, కాంగ్రెస్‌లోని సీనియర్లు, తృణమూల్, డిఎంకెలు వ్యతిరేకించినా కాంగ్రెస్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? అలనాడు ఇందిరా గాంధీ కమిటెడ్ జుడిషియరీ కోసం ప్రయత్నించి భంగపడింది. ఆమె మనవడు రాహుల్ గాంధీ ఇప్పుడు కమిటెడ్ జుడిషియరీ కోసం ప్రయత్నిస్తున్నట్టుంది. న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాల్ని సమర్ధించాలన్నదే కమిటెడ్ జుడిషియరీ.
- గునే్నశ్, కొవ్వాడ
వినోదం చూస్తున్నారు..
‘్ధర్మపోరాటం’ సక్సెస్ అయినందుకు ఏపీ సీఎం చంద్రబాబు మురిసిపోతున్నాడు. ప్రజల సొమ్ము ధారాళంగా ఖర్చుపెట్టి, కేంద్రానికి వ్యతిరేకంగా ఈవెంట్స్ నిర్వహించి తను హీరో అయిపోవడం బాబుకి అలవాటే. కొందరు నేతలు పిలవగానే వచ్చి, బాబుని పొగుడుతూ, కేంద్రాన్ని తిడుతుంటే- ప్రజలకు మాత్రం ఇదంతా స్పాన్సర్డ్ కార్యక్రమంలా కనిపించింది. క్రమక్రమంగా ‘హోదా’ ఉద్యమం బాబు చేయిజారి సాధన సమితి చేతిలోకి పోతున్నట్లుంది. వాళ్లు ఇప్పటికే ‘రైళ్లు ఆపేస్తాం.. కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు పనిచేయనివ్వం..’ అని అంటున్నారు. చంద్రబాబు వాళ్లని ఆపగలడా?
- స్నేహమాధురి, పెద్దాపురం