ఉత్తరాయణం

సివిల్స్ పరీక్షా విధానంతో ఆటలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో కార్యనిర్వాహక వ్యవస్థకి వెనె్నముకగా నిలుస్తున్న అఖిల భారత సర్వీసులకు జరుగుతున్న ఎంపిక విధానం అత్యుత్తమమైనది, పారదర్శకమైనది. మూడుదశల కఠిన వడపోతలను దాటి ఎంపికైన అభ్యర్థులకు తదుపరి 15నెలల ఫౌండేషన్ కోర్సు ఉంటుంది. అయితే అది ర్యాంకుల్ని ప్రభావితం చెయ్యదు. ప్రస్తుతం ప్రభుత్వం ఆ కోర్సులో మార్కుల విధానం పెట్టి, ముందు పరీక్షలో సాధించిన మార్కులతో వీటిని కలిపి, తద్వారా సర్వీసుల కేటాయింపు జరిపే దిశగా ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు అంత ఆరోగ్యకరమైనవి కావు. ఎందుకంటే ఇంతవరకూ నడుస్తున్న విధానంలో పారదర్శకత, నిస్పక్షపాత వైఖరికి ప్రాధాన్యత ఉంది. పరీక్షని పర్యవేక్షిస్తున్న యూపీఎస్సీ రాజ్యాంగ బద్ధత, స్వతంత్రత ఉన్న సంస్థ. ఆ సంస్థ చైర్మన్ గానీ, సభ్యులు గానీ పదవీ విరమణ తర్వాత ఎలాంటి పదవీ చేపట్టరాదు. కనుక రాజకీయ వత్తిళ్ళు వీరి బాధ్యతా నిర్వహణలో ఉండే అవకాశం తక్కువ. ఫౌండేషన్ కోర్సు విషయంలో అలా కాదు. దాని నిర్వహణ యూపీఎస్సీ పరిధిలోనిది కాదు. ప్రభుత్వ అధికారులే దాన్ని నిర్వహిస్తుంటారు. కాబట్టి వారిచేతిలో మార్కులుంటే, వాటికి అభ్యర్థుల అవకాశాల్ని ప్రభావితం చేసే శక్తి ఉంటే, దానివల్ల నష్టమే ఎక్కువ. 10, 12 తరగతుల్లో పాఠశాలల చేతిలో ఉన్న ఇంటర్నల్ మార్కుల విధానం ఎలా దుర్వినియోగం జరుగుతోందో చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితి ప్రవేశపెడితే సివిల్స్ ప్రతిష్టకి నష్టమే కాకుండా, అర్హులకు అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ప్రభుత్వం తన ప్రతిపాదన ఉపసంహరించాలి. దీనికి బదులుగా పరీక్షా విధానంలో వివిధ నేపథ్యాల నుండి వచ్చిన అభ్యర్థులు సమాన రీతిలో న్యాయం పొందేలా సంస్కరణలు చేపట్టాలి.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
మితిమీరిన వ్యాఖ్యలు
మన నేతలు ఇచ్ఛారీతిన మాట్లాడుతున్న వైఖరి, చెప్తున్న అబద్ధాలు చూసి జనం అసహ్యించుకుంటున్నారు. ఈమధ్య ఏపీ వ్యవసాయ మంత్రి చంద్రమోహన్‌రెడ్డి దేశంలో పరిస్థితి ఎమర్జెన్సీని తలపింపజేస్తున్నదని అన్నారు. అదే నిజమైతే చంద్రబాబు గాని, ఇతర తెదేపా నేతలు గాని యథేచ్ఛగా రోజూ ప్రధానమంత్రిని తిట్టగలిగేవారా? ప్రధాని ఇల్లు ముట్టడి, ధర్మపోరాట దీక్షలూ చేయగలిగేవారా? తమ అధినేతను మెప్పించి ప్రయోజనాలు పొందడానికే మంత్రులు ఇలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. నేతలంతా ఇలా విజృంభిస్తున్నారంటే ఎమర్జెన్సీ పరిస్థితి లేనట్టే కదా. మరెందుకీ అబద్ధాలు?
- చైతన్య, వాకలపూడి
ఇంకా ఆంగ్లో ఇండియన్లా?
1947 నాటికి భారత-ఇంగ్లండ్‌కి చెందినవారు చేసుకున్న వివాహాల వల్ల జన్మించిన వారిని ‘ఆంగ్లో-ఇండియన్స్’గా పరిగణించి, వారికి కల్పించబడిన రక్షణలలో భాగంగా చట్టసభలకు నామినేట్ చేస్తున్నారు. ఆంగ్ల పాలకులు దేశాన్ని వీడి 70 సంవత్సరాలైనా ఇప్పటికీ వారి సంతానాన్ని కూడా ఆంగ్లో-ఇండియన్లుగానే పరిగణిస్తున్నారు! (వారు క్రిస్టియన్లు ఇంకా ఇతర మతాల వారిని పెళ్ళిచేసుకున్నా కూడా) ఆంగ్లో-ఇండియన్లు ఇంగ్లీషు మాత్రమే మాట్లాడుతారు. భారతీయ క్రిస్టియన్ల కన్నా తాము అధికులమనుకుంటారు! ఆంగ్లో-ఇండియన్లను చట్టసభలకి నామినేట్ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను, నిబంధనలను మార్చవలసిన అవసరం ఉంది. అసలు అలాంటి నామినేషన్లను రద్దు చేయటం మంచిది.
- ఎన్.మధుసూదనరావు, హైదరాబాద్
ప్రగల్భాల రాహుల్
‘నేనే భావిభారత ప్రధానిని! మోదీకి నేనంటే భయం. పార్లమెంటులో నేను 15 నిమిషాలు మాట్లాడితే చాలు మోదీ పారిపోతాడు’.. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఉత్తర కుమార ప్రగల్భాలు మనకు గుర్తుకొస్తాయి. ఇలా మాట్లాడే వారిలో ఆత్మన్యూనత ఉంటుందని మానసిక శాస్తజ్ఞ్రులు చెప్తున్నారు. గతంలో ఓసారి- ‘నేను పార్లమెంటులో మాట్లాడితే భూకంపం వస్తుందని’ నేటి ఉత్తర కుమారుడు రాహుల్ అన్నాడు. అయితే- ప్రజలపై దయదలచి ఆయన పార్లమెంటులో నోరు విప్పకుండా భూకంపాన్ని ఆపేశాడు!
- మరుదకాశి, కరప
ఎన్నాళ్లు తిడతారు?
బలవంతుడైన ప్రత్యర్థిపై పోరాడి గెలిచే అవకాశం లేనప్పుడు అతడిని ఘోరంగా అవమానించి ప్రజల దృష్టిలో అపఖ్యాతి పాలుచేస్తే చాలన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు పాటిస్తున్నాడు. అయితే, ఈ సిద్ధాంతం అన్నివేళలా అందరిపట్లా ఒకేలాగ పనిచేయకపోవచ్చు. ఒక్కోసారి బెడిసికొట్టవచ్చు. ఎప్పుడూ ఇతరులను తిట్టేవాడిని ప్రజలు కొంతకాలం నమ్మవచ్చు. కొంతవరకు సానుభూతి చూపవచ్చు. కొన్నాళ్లకు ఆ తిట్టేవాడిని ప్రజలు పట్టించుకోకపోవచ్చు!
- ప్రసన్న, పేర్రాజుపేట