ఉత్తరాయణం

ఐశ్వర్యమున్నా ‘ఆకలి ప్రపంచం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా ఆకలి జీవుల సంఖ్య కోట్లాదిగా పెరుగుతూ పోతుందని ఐక్యరాజ్య సమితి లెక్కలు తేల్చి చెప్తున్నాయి. తాజా గణంకాల ప్రకారం దశాబ్దకాలం వరకూ అదుపులో ఉన్న ‘ఆకలి సూచీ’ మళ్ళీ పైపైకి దూసుకుపోవడం ప్రపంచ దేశాలు తలదించుకోవాల్సిన వాస్తవం. ఆకలి, పేదరికం తగ్గించుకోవాలంటూ ప్రతిన బూనిన దేశాలు కార్యాచరణలో విఫలం కావడం ప్రస్తుత దుస్థితికి కారణం. దాదాపు 83 కోట్ల ప్రజానీకం క్షుద్బాధితులు. అందులో దక్షిణాసియా దేశాలది ముందు వరుస. దేశాలవారీ గణాంకాల్ని ఐక్యరాజ్యసమితి విడుదల చెయ్యకపోయినా, దక్షిణాసియా దేశాల్లో భారత్ వాటా అధికమేనన్నది చేదు నిజం. త్వరలో ‘ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ’గా రూపుదిద్దుకొంటున్న భారత్ ప్రజాబాహుళ్యపు జీవన స్థాయిని మెరుగుపర్చలేకపోతే అన్యాయమే. ప్రస్తుతం పెరుగుతున్న సంపద అంతా మూడొంతులు గుప్పెడు మంది చేతిలోనే పోగుపడుతోంది. అధిక శాతం మంది పేదరికంలోనే మగ్గాల్సి వస్తోంది. సంపద సృష్టి ఎంత ముఖ్యమో, సమాన పంపిణీ కూడా అంతే ముఖ్యం. అన్నార్తుల ఆకలి తీర్చలేని సంపద ఎంత పెరిగినా ఏమి ప్రయోజనం? మానవాభివృద్ధి సూచీలో అభివృద్ధి మాత్రమే నిజమైన అభివృద్ధిగా పరిగణనలోకి తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మన దేశం వెనకబడిన దేశం క్రిందనే జమ కట్టబడుతుంది. ఆకలి సూచీ పెరుగుదలకు ముఖ్యంగా అశాంతి, ఘర్షణలు, వాతావరణ మార్పులు హేతువులని నివేదిక అభిప్రాయ పడింది. ఈ కారణాలన్నీ అదుపులో పెట్టదగ్గవే. పాలకుల్లో ముందుచూపు, మానవ సంక్షేమాన్ని ప్రాధాన్యతాంశంగా గుర్తించే దృక్పథం ఉంటే ప్రగతి సాధ్యవౌతుంది. దేశాల నాయకత్వాలు ఆ తరహా దృక్పథాన్ని అలవర్చుకొనేలా పౌర సమాజం చైతన్యం ప్రోదిచెయ్యాలి. సంపన్న దేశంగా, ప్రజాస్వామ్య దేశంగా భారత్ కృషి మరింత మెరుగ్గాఉండాలి. మంచినీటి సమస్య తీవ్రస్థాయిలో ముంచుకు రాబోతున్నదంటూ ఐక్యరాజ్యసమితి మన దేశానికి మరో హెచ్చరిక చేసింది. ఈ సవాళ్ళన్నీ ఉపేక్షించదగినవి కావు.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం