ఉత్తరాయణం

ట్రంప్ విధానాలపై ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూరోపియన్ యూనియన్ (ఈయూ)నుంచి బ్రిటన్ వైదొలగాలని నిర్ణయించుకోగా తాజాగా ఈయూ నుండి వైదొలగి తమతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. ఈ విధంగా ఈయూలో చీలిక తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు భావించాలి. యూరోపియన్ యూనియన్ కలిసికట్టుగా ఉండాలని ఫ్రాన్స్ దృఢంగా కోరుతున్నది. చైనాతో ప్రారంభించి ఈయూ, భారత్ పైన వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన ట్రంప్ ఫ్రాన్స్‌ను ఈయూ నుండి విడదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా దిగుమతులపై కూడా సుంకాలను పెంచుతున్నట్లు ఈయూ ప్రకటించింది. దీనిపైన ట్రంప్ ఆగ్రహం ప్రకటిస్తున్నాడు. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్ అనుసరిస్తున్న వాణిజ్య యుద్ధం అంతర్జాతీయంగా అనేక విపరిణామాలకు దారితీయనున్నది. ఇటీవల కెనడాలో జరిగిన జి 7 దేశాల శిఖరాగ్ర సమావేశంలోనూ నాటోవలే నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (నాఫ్టా)కూడా అధ్వాన్నంగా తయారైందని వ్యాఖ్యానించి దానినుండి కూడా వైదొలగుతామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ విధమైన నిరంకుశ, ఏకపక్ష విధానాలతో ప్రపంచంలో చీలికలు తీసుకురావడానికి, అస్థిరత సృష్టించడానికి తద్వారా ప్రపంచ దేశాలపై తన పెత్తనం చెలాయించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ దేశాలు సంఘటితంగా ఎదిరించాలి. అనుమతి పత్రాలులేకుండా దేశంలోకి వస్తున్న శరణార్థుల పిల్లలను వేరుచేసి నిర్బంధ శిబిరాలలో ఉంచిన ట్రంప్ ఆ తరువాత తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే వలస విధానాన్ని మాత్రం కొనసాగించడానికే నిర్ణయించారు. ఏడు ముస్లిం దేశాలనుండి ఎవరినీ తమ దేశంలోకి అనుమతించేది లేదంటూ గతంలో చేసిన నిర్ణయానికి అనుకూలంగా కోర్టు తీర్పుచెప్పడంతో ఇప్పుడు ట్రంప్ మరింతగా వలస విధానాన్ని అమలుజరిపే అవకాశం ఉంది. దీనిపై కూడా అన్ని దేశాలు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
- సి.హెచ్.ప్రతాప్, శ్రీకాకుళం

కర్ర పెత్తనానికి ‘నో..’- చీపురుకట్టకి ఊపిరి!
ఢిల్లీ పాలన విషయమై సుప్రీంకోర్టు ప్రజా ప్రభుత్వానికి పట్టంకడుతూ మంచి తీర్పు వెలువరించింది. ఢిల్లీ రాష్ట్ర పాలనలో ప్రజలెన్నుకొన్న ప్రభుత్వానిదే ప్రముఖ స్థానమని గుర్తుచేస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర పరిధుల్ని ఎత్తిచూపింది. తద్వారా పరోక్షంగా కేంద్ర పెత్తనం చెల్లదని చెప్పినట్లైయింది. ఆప్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచింది లగాయతు అక్కడ లెప్టినెంట్ గవర్నర్‌తో పేచీల పర్వం కొనసాగుతూ వచ్చింది. గత నాలుగేళ్లుగా ముదురుతూ వస్తున్న సంఘర్షణ వైఖరి ఆ ముఖ్యమంత్రి, గవర్నరుగారింట్లోనే సోఫా ధర్నాచేసే దాకా అసహ్యకరంగా పరిణమించింది. కయ్యానికి కాలుదువ్వే ముఖ్యమంత్రి ఒకవైపు, అయినదానికీ, కానిదానికీ కాళ్లకు అడ్డంపడే లెఫ్టినెంట్ గవర్నర్ ఒకవైపు మోహరించి ప్రజాపాలన పడకేసింది. అయితే ఈ పాపంలో సింహ భాగం కేంద్రానిది.. కేంద్ర ప్రతినిధి లెఫ్టినెంట్ గవర్నరుది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ఆ మంత్రివర్గం చేసే అన్ని సిఫార్సుల్ని వ్యతిరేకించి, లేదా తొక్కిపెట్టి లేదా, రాష్టప్రతికి పంపడం ద్వారా చేతులు దులుపుకొని ఆయా ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలిపారు. ఇప్పుడు సుప్రీం రాష్టప్రరిధిలోని అంశాలపై ఆయన అంగీకారంతో పనిలేదని, తెలియపరిస్తే చాలని, మంత్రివర్గం సహాయ, సలహాలపైనే ఆయన పనిచెయ్యాలని చెప్పడంతో ప్రజల తీర్పుకి, రాజ్యాంగ స్ఫూర్తికి పెద్దపీట వేసినట్లైయింది. సుప్రీం హిత వచనాలతోనైనా పాలనపై శ్రద్ధపెట్టాలి. పెత్తనం మాని కర్ర ఓ మూల కుదురుగా కూర్చుంటే, ప్రతిష్ట పెరిగిన చీపురు బాధ్యతగా శుభ్రంచేస్తే ఇల్లు బాగుంటుంది. అయితే ఎన్నికలవేళ ఆ తరహా పెద్దరికం వంటబడుతుందా అన్నది శేష ప్రశ్న. రాజకీయ లబ్దికోసం ఇరువురూ వారివారి పంధాలోనే సాగే అవకాశాలే మెండు అన్నది ఓ సందేహం.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

జంతువులను కాపాడండి
నెహ్రూ జూలాజికల్ పార్కులో ఇటీవల పెద్దపెద్ద జంతువులు వ్యాధుల బారిన పడుతూ మృతి చెందడం శోచనీయం. సంవత్సర కాలంలో 70 జంతువులు మృతి చెందగా ఇటీవల నీటి గుర్రం, అరుదైన సింహం, చిరుతపులి మొదలైనవి మృతి చెందాయి. వ్యాధుల బారినపడుతున్న వన్యమృగాలు ఎందుకు వ్యాధులబారిన పడుతున్నాయి. వాటి నివారణ చర్యలేమిటో శ్రద్ధచూపకపోవడంవల్ల వన్యప్రాణులు ఇంకా ఇంకా మృతి చెందుతున్నాయి. వాటికిచ్చే ఆహారం, నీరు పరిశుభ్రతను తనిఖీ చేయాలి. నాణ్యమైన ఆహారాన్ని, నీటినీ అందించాలి. మూగజీవులను జన సందర్శనార్థం పెంచడమేకాదు వాటిని ప్రేమించాలి. వాటినీ మన కుటుంబ సభ్యులా, మిత్రుల్లా భావించాలి. వన్యప్రాణులను అంతరించకుండా చూడాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం