ఉత్తరాయణం

లోపిస్తున్న పుస్తక పఠనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు సమాజంలో నెలకొన్న అనేకానేక సమస్యలకు పుస్తక పఠనం అలవాటు లోపించడం ఒక కారణంగా పేర్కొనవచ్చు. పుస్తక పఠనం వల్ల ఎవరైనా ప్రశాంతమైన మనస్సుతో తమ జీవితం గురించి లోతుగా ఆలోచించి, తమ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను ఎంచుకొనేవారిగా తయారవుతారు. మెదడు పనిచేసే తీరు గ్రంథ పఠనం వల్ల మెరుగవుతుంది. తమ పనులను చురుగ్గా చేసుకోగలుగుతారు. రోజుకు కనీసం అరగంట సేపు పుస్తక పఠనం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. మనసుకు, మెదడుకు అనుసంధానం జరిగి అదే ధ్యానంగా మారుతుంది. మతిమరుపు తగ్గడానికి పుస్తక పఠనం దోహదం చేయగలదని పరిశోధనలు నిరూపిస్తున్నాయి. వయసు ప్రభావం మెదడు మీద పడకుండా చేసే శక్తి పుస్తక పఠనానికి ఉంది. పుస్తక పఠనం మానసిక వికాసానికి, ఉన్నతికి దోహదపడుతుంది. పుస్తక పఠనం వల్ల కలిగే జ్ఞానం మనిషిని మరింత రాటుదేలేలా చేస్తుంది. ఒక వ్యక్తి ఇతరులతో స్పందించే తీరు పుస్తక పఠనం వల్ల మెరుగవుతుంది. మనలోని మానవత్వాన్ని మేల్కొలుపుతుంది. ఇతరుల కష్టంలో సుఖంలో పాలుపంచుకునే తత్వం అలవడుతుంది. సంస్కారం పెరుగుతుంది, సామాజిక జీవనం ప్రశాంతంగా గడపగలుగుతారు. నేరాల సంఖ్య తగ్గేందుకు సైతం దోహదపడుతుంది. శాస్ర్తియ దృక్పథం అలవడుతుంది, మూఢ నమ్మకాలను విడనాడుతారు. ప్రశ్నించేతత్వం అలవడుతుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే తత్వం, సమర్ధించే తత్వం అలవడుతుంది. పిల్లలకు పుస్తక పఠనం చిన్నప్పటినుంచే అలవాటు చేయాలి. చదవడంలోగల ఆనందాన్ని పిల్లలకు అలవాటు చేయడం ద్వారా వారికి విజ్ఞానంతోపాటు మానసిక ఉల్లాసాన్ని కలుగజేయవచ్చు. ఇంట్లో పెద్దవాళ్లకు చదువుకునే అలవాటు ఉంటే పిల్లలు కూడా సులభంగా దానిని అలవర్చుకోగలరు. చదివే అలవాటును నెమ్మదిగా అలవరచాలి గానీ, ఒక్కసారిగా అది సాధ్యం కాని పనిగా గుర్తించాలి. ఇంట్లోనేకాదు సమాజంలోను పుస్తక పఠనం అభిరుచిని విస్తృతి చేయాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో, అన్ని విద్యా సంస్థల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి. తద్వారా వారంలో కనీసం మూడునాలుగు గంటలు అయినా పుస్తక పఠనం కోసం లైబ్రరీలో గడిపేలా లైబ్రరీ పీరియడ్లను ఉండేలా చూడాలి. కాలక్షేపాన్ని, వినోదాన్ని అందిస్తున్న అనేక సాధనాలు నేడు అందుబాటులో ఉన్నందున చాలామంది పుస్తక పఠనం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. పుస్తక పఠనం ఎన్నోవిధాలుగా మేలు చేస్తుంది. వ్యక్తులను మహనీయులుగా మహోన్నతులుగా తీర్చిదిద్దే శక్తి పుస్తక పఠనానికి ఉంది.

-vasilisuresh@gmail.com