ఉత్తరాయణం

ప్రముఖులపై పోస్టల్ స్టాంపులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుగడ్డపై పుట్టి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ప్రముఖులను సముచిత రీతిన గౌరవించవలసిన బాధ్యత అందరిపై ఉంది. తెలుగువారి పండుగలు, ప్రముఖులపై పోస్టల్ శాఖ స్టాంపులను విడుదల చేయాలి. డాక్టర్ సి.నారాయణరెడ్డి, బతుకమ్మ పండుగ, వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భం గా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి పోస్టల్ స్టాంపులు వస్తే గౌరవంగా ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి కేంద్రానికి, భారతీయ తపాలా శాఖకు లేఖ రాయాల్సిన అవసరం ఉంది.
-ఎం.కృష్ణమూర్తి, సూర్యాపేట
పర్యావరణాన్ని కాపాడుకుందాం
మన పూర్వీకులు పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించేవారు. కూరగాయలు, పచారీ సామాన్లు తెచ్చుకునేందుకు ఈత ఆకులు, తాటాకులు, వెదురుబుట్టలు వంటివాటిని వాడేవారు. పిల్లల ఆటవస్తువులు కూడా వాటితోనే చేసేవారు. ఇప్పుడు ప్లాస్టిక్‌పై మోజుతో వాడుతున్నారు. ఇది పర్యావరణానికి హాని చేస్తుంది. పాతతరం వారు వాడిన వస్తువుల వల్ల ఎందరికో ఉపాధి కూడా దొరికేది. ప్రకృతికి కీడు జరిగేది కాదు. భేషజాలకు పోకుండా, నామోషీగా భావించకుండా అప్పటి వారు వాడిన వస్తువులను మనమూ వాడొచ్చు.
-నయనాల సూర్యప్రకాశరావు, కాకినాడ
సిఐఎస్‌ఎఫ్ నిర్ణయం మంచిదే
విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మెట్రో రైల్వే వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు పేరుమోసిన, ప్రముఖమైన సంస్థల వద్ద భద్రతాపరమైన ఏర్పాట్లను నిర్వహించడానికి కేంద్ర పారిశ్రామిక భద్రతా సంస్థ ముందుకురావడం అభినందనీయం. ఇటీవలికాలంలో ఉగ్రవాద, మావోయిస్టు తీవ్రవాదుల బెడద ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై ఉంటోంది. అందువల్ల తాజాగా సిఐఎస్‌ఎఫ్ తీసుకున్న నిర్ణయం సబబే. అసలు ఆ సంస్థ రంగంలోకి దిగిందీ అంటేనే ప్రజలకు భరోసా ఏర్పడుతుంది. క వ్యక్తిగత, రాజకీయ స్పర్థల కారణంగా పేరుమోసిన సంస్థల వద్ద ఘర్షణలు జరగకుండా నివారించడంలోనూ ఇకముందు సిఐఎస్‌ఎఫ్ క్రియాశీలకంగా వ్యవహించనుండటం మంచి పరిణామమే.
బి.ఎం.రెడ్డి, కర్నూలు