ఉత్తరాయణం

ఫేస్‌బుక్ పరిచయాలతో జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫేస్‌బుక్ పరిచయాలు, ఆన్‌లైన్ చాటింగ్‌తో మోసపోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయినా, యువత గుణపాఠం నేర్చుకోవడం లేదు. ఇటీవల ఒక అమ్మాయి ఫేస్‌బుక్ ద్వారా ఒక యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకొని, అతని చేతిలో మృత్యువాత పడితే, అతను ఇంట్లోనే ఆమెను సమాధి చేశాడని వార్తలొచ్చాయి. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో మోసం బయటపడింది. పెళ్లిపేరుతో లక్షలకు లక్షలు దోచుకున్న ఉదంతాలు కోకొల్లలు. అయినా ఆన్‌లైన్ చాటింగ్‌లు ఆగడం లేదు. ముక్కూమొహం తెలియని వ్యక్తికి వ్యక్తిగత సమాచారాన్ని తెలిపి, ఆర్థికంగా మోసపోవడమే కాదు, జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. చాటింగ్ ద్వారా సమయం వృథా చేసుకోవడమే కాకుండా, జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఎక్కువగా బలైపోతున్నది అమ్మాయిలే. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పూర్తి సమాచారం తెలుసుకుని పెళ్లిచేసుకుంటే ఎలాంటి కష్టాలు ఉండవని టీనేజీ యువత గ్రహించాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు
దత్తపుత్రుడు.. కొత్తచుట్టం..
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని పరికిస్తే ఎంత సీరియస్‌గా నడుస్తుందో, అంత వినోదం పంచుతోంది. పంచ్‌లే పంచులు. ఉత్తరప్రదేశ్‌కి తాను దత్తపుత్రుడినని ప్రధాని మోదీ అభివర్ణించుకొన్నారు. ప్రచార బరిలోకి దూకిన సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక- అసలు యుపికి దత్తపుత్రుల అవసరమే లేదంటున్నారు. అవసరం ఉందో లేదో ఆమెకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి దూకిన కొత్త చుట్టం కదా. అఖిలేష్, రాహుల్ గాంధీ ఒకే డ్రస్సు, ఒకే స్టయిల్‌తో కవలల్ని మరిపిస్తూ ప్రజలను అలరిస్తున్నారు. ఫలితాల తరువాత బంధాలెలా ఉంటాయో బ్రహ్మదేవుడికైనా తెలిసే ఛాన్సులేదు. ‘అడ్డాలనాడు బిడ్డలుగాని, గద్దెనెక్కిన్నాడు బిడ్డలా’అంటూ ములాయం ఎక్కడ తత్వాలు పాడుతూ తిరుగుతున్నాడో తెలిసి రావడం లేదు. ఇక బెహన్‌జీ మాయావతి కూడా బేషజాలేమీ పెట్టుకోకుండా తన లెక్కలూ, కూడికలతో ముందుకు సాగుతున్నారు. ప్రజలు మాత్రం ఎన్ని బంధుత్వాలు కలిసినా, ఎన్ని గ్లిజరిన్ కన్నీళ్ళు ఒలికినా ఒకసారి పోలింగ్ బూత్‌కివెళ్ళి, వేలికిముద్ర వేయించుకొన్నాక.. ‘అందరం వేలువిడిచిన దూరపు చుట్టాలుగానే మిగిలిపోతాం కదా’ అనుకొంటున్నట్టున్నారు.
- డా.డివిజి శంకరరావు, పార్వతీపురం
ఆదేశాలు బేఖాతరు
కేంద్ర ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ (్భరత్‌లో తయారీ)లో భాగంగా గ్రామ, పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి లభించేలా ముద్రా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా నిరుద్యోగులకు ఏభైవేల నుండి పది లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీలేకుండా రుణ సదుపాయాన్ని కల్పించాలని బ్యాంకులకు కేంద్రం ఆదేశాలిచ్చింది. అయితే ఏ ఒక్క బ్యాంకు కూడా ఆ ఆదేశాలను పాటించిన జాడలేదు. రుణం కోసం అవసరమైన అన్ని ధ్రువపత్రాలు సమర్పించినా, రకరకాల సమస్యలను సృష్టిస్తూ బ్యాంకు అధికారులు తిరస్కరిస్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బ్యాంకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చి ప్రతినెల నిర్దిష్టంగా కొంతమందికైనా రుణాలు మంజూరు చేయాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
సడలింపులు సరికాదు
తెలంగాణ గురుకుల విద్యాసంస్థల్లో టీచర్ పోస్టుల భర్తీకి డిగ్రీ, పిజిలలో ప్రథమశ్రేణికి చెందినవారే అర్హులనే నిబంధనను సిఎం కెసిఆర్ జోక్యంతో తొలగించారు. టి-జెఎసి చైర్మన్ కోదండరాం మాత్రం- ‘ఉద్యమాలు చేస్తూ పరీక్షలు వ్రాసినవారికి 60 శాతం మార్కులెలా వస్తాయి?’ అని ప్రశ్నించడం తగదు. ‘ప్రథమశ్రేణి’ ఉత్తీర్ణత నిబంధన వల్ల ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు అవకాశం ఉంటుంది.