ఉత్తరాయణం

పింగళి కుటుంబాన్ని ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పింగళి వెంకయ్య గొప్ప దేశభక్తుడు, జాతీయ జెం డాను రూపొందించినవాడు. స్వాతంత్య్ర సమరంలో ఆయన నిర్వహించిన విశిష్ట పాత్ర, జవహర్‌లాల్‌నెహ్రూ, సర్దార్ పటేల్, మహాత్మాగాంధీల ప్రశంసలందుకుంది. ఆయన జగద్గురు శంకరాచార్య భక్తుడు కూడ. ఆయన తన జీవితంలో ‘మానవ సేవయే మాధవ సేవ’ అనే నినాదాన్ని తూచ తప్పకుండా పాటించినవాడాయన. అంత చేసి ఆయన పేదరికంలోనే మరణించారు. ప్రస్తు తం ఆయన కుటుంబానికి చెందిన వారు దుర్భరదా రిద్య్రంతో బాధపడుతున్నారు. అటువంటి త్యాగ పురుషుడి కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం దేశంపై ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి, వారు పేదరికం నుంచి బయటపడేందుకు వీలుగా తగిన సహాయ సహకారాలు అందించాలి.
- జి. చిట్టిబాబు, హైదరాబాద్
రాజ్యాంగ విరుద్ధమే
భరత భూమిలో పుట్టి, భరత భూమిలో పండిన పంటలు తింటూ, భరత భూమిలో తిరిగే జంతువుల మాంసాన్ని భుజిస్తూ, ఇక్కడి ప్రకృతిని ఆస్వాదిస్తూ.. అసదుద్దీన్ ఒవైసీ భారత్ మాతాకీ జై అనడట! భరత మా తను తల్లిగా భావించి జై అనమంటే ఆవిధంగా అననని చెప్పడం జాతి వ్యతిరేకమే. వీరు పాక్ మాతను, ఆఫ్ఘన్ మాతను గౌరవించి జై కొడతారా? రాజ్యాంగ నిర్మాత లకు ఇటువంటి దేశభక్తి లేని వ్యక్తులు రాబోయే కాలంలో పుడతారన్న అనుమానం వచ్చుంటే ఆనాడే రాజ్యాం గంలో రాసి ఉండేవారు. దేశభక్తి లేనివారు మాత్రమే భారత్ మాతాకీ జై అని అనలేరు.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
మహిళా రిజర్వేషన్లు ఎందుకు?
మన దేశంలో ఏ రాజకీయ పదవి చేపట్టటానికి గాని, ఏ ఉద్యోగమైనా చేయటానికి గాని, పురుషుడితోపాటు సమానంగా పోటీ చేయటానికి గాని, ఆ పదవి నిర్వహించటానికి గాని మహిళకు ఏ నిబంధన, ఏ చట్టం అడ్డుపడటం లేదే? మరి అటువంటప్పుడు స్వార్థ రాజకీయ నాయకులు మహిళా రిజర్వేషన్లను ఎందుకు కోరుతున్నారంటే ఆ మహిళల భర్త, బంధువులో పెత్తనం చెలాయించటానికి. ఒకే కుటుంబంలో 2, 3 పదవులు పొందటానికి మాత్రమే.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ
శుభ పరిణామం
పాకిస్తాన్, అమెరికా దేశాధ్యక్షుల మధ్య ఇటీవల జరిగిన సమావేశంలో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లలో వున్న ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ అభయం యివ్వడం ఒక మంచి పరిణామం. అట్లే ఉగ్రవాద దుశ్చర్యలను నిరోధించే ప్రక్రియలో ఇతర దేశాలకు తమ సహాయ సహకారాలను అందిస్తామని వాగ్దానం చెయ్యడం కూడా ఆనందదాయకం. అయితే మిగతా సందర్భాలలో వలె ఒట్టిమాటలు కాకుండా పాకిస్తాన్ చేతలలో చూపించడం చాలా అవసరం. ఉగ్రవాదాన్ని సమర్ధించడం అనేది పాముకు పాలుపోసి పెంచడం వంటిది. ఎంత ప్రేమతో పోషించినా పాలు పోసిన వాడినే చివరకు బలి తీసుకుంటుంది. పాకిస్తాన్ కూడా పెంచి పోషించి, ఆదరించిన ఉగ్రవాద సంస్థలు చివరకు ఆ దేశానే్న బలితీసుకున్నాయి. వేలాది ప్రజల, కోట్లాది రూపాయలు ఆస్తి ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా విశ్వాస రహిత దేశంగా అప్రతిష్ఠను కూడా మూటకట్టుకుంది. ఇంతగా తాను నష్టపోతున్నా పాక్‌వైఖరిలో మార్పు రాకపోవడమే విచిత్రం. మారుతున్న ప్రపంచ సమీకరణలో పగలు, ప్రతీకారాలు పక్కనపెట్టి అభివృద్ధి దిశగా అడుగులు వేయడం ఆ దేశానికి ఎంతో శ్రేయస్కరం.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
సహనం ఎక్కడుంది?
భారతదేశంలో సహనం లేదు మొర్రో అని కొన్ని వెర్రి తలలు శివాలెత్తిపోతున్నాయి. వారి కంటికి పాకిస్తాన్ కనబడదా? అక్కడ మన క్రికెటర్ విరాట్ కోహ్లిని ఓ అభిమాని పొగిడితే అతడికి పదేళ్ళ శిక్ష విధించారు. పాక్ కెప్టెన్ ఆఫ్రిది తనకు భారత్‌లో అభిమానులున్నారనగానే అతనికి పాక్ కోర్టు నోటీసు పంపింది. మన హైదరాబాదీ, అసదుద్దీన్ మహాశయుడు. ‘్భరత్ మాతాకి జై’ అనను ఏంచేస్తారో చేసుకోండని బహిరంగ ప్రకటన యిస్తే మనం అత్యంత సహనంతో ఓర్చుకుంటున్నాము. సహ నం ఏ దేశంలోనున్నది? మన హిందీ హీరోలు మన దేశ ఔన్నత్యాన్ని ప్రసంసించడం పోయి విమర్శించడం విచారకరం.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
నిందితులకు రక్షణ కల్పించాలి
చాలా సందర్భాల్లో నేడు నిందితులపై ప్రజలు దాడి చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయ. వీరి నుంచి నిందితులకు రక్షణ కల్పించాలి. అలాగే నేరం అనేది రకరకాల కారణంవల్ల జరుగుతాయి. వారి నేరాన్ని కోర్టులు విచారించి నిర్ధారించాలి. కాని వీటికి సమయం పడుతుంది. ఫిర్యాదుచేసిన వెంటనే అరెస్టు చెయ్యడం సరికాదు. చట్టాల దుర్వినియోగం అరికట్టాలి.
- వరదారావు, కూర్మన్నపాలెం