ఉత్తరాయణం

విపక్షాలు ఇందుకేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరడంతో విసుగెత్తిన ప్ర జలు నరేంద్ర మోదీపై ఎంతో విశ్వాసం ఉంచి గత ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి అధికారం కట్టబెట్టారు. నల్లధనాన్ని అంతం చేసేందుకు మోదీ పెద్దనోట్లను రద్దు చేయగా ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డా ఎంతో సహనం ప్రదర్శించారు. నగదు లేక, చిల్లర లేక అనునిత్యం అవస్థలు పడినా తమకు ప్రధాని మోదీ ఏదో మంచి చేస్తారని ప్రజలు ఎదురుచూశారు. అయితే, ప్రతిపక్షాలు మాత్రం ఎలాంటి సంయమనం పాటించకుండా ఆందోళనల పేరిట రోడ్డెక్కాయి. కొందరు విపక్ష నేతలు ఎంతగా రెచ్చగొట్టినా ప్రజలు ఎలాంటి ఆందోళనలకు దిగలేదు. కానీ, కొంతమంది బ్యాంకు అధికారులు మాత్రం కమీషన్లకు కక్కుర్తిపడి ప్రజలకు అందాల్సిన కొత్త కరెన్సీని బడాబాబులకు భారీ ఎత్తున అందజేశారు. అయినప్పటికీ ప్రజలు ఓపికతో వ్యవహరించేరే తప్ప బ్యాంకులపై ఎక్కడా దాడులు చేయలేదు. ప్రతిపక్షాలు ఇకనైనా లేనిపోని రాద్ధాంతం చెయ్యకుండా, నల్లధనం వెలికితీతకు మోదీ చేస్తున్న ప్రయత్నాలను సమర్ధించడమే ఉత్తమం. ప్రభుత్వం చేసే మంచిపనులకు మద్దతు ఇవ్వాలి.
- డి.శంకరనారాయణ, విజయవాడ

చెడుదారిలో యువత
‘మొక్కై వంగనిది మానై వంగునా?’ ఈ మాట యువత విషయంలో ముమ్మాటికీ నిజం. చాలామంది యువకులు కొంత వయస్సు వచ్చేంతవరకు తల్లిదండ్రుల మాట వింటారు. కొంతమంది అస్సలు వినరు. ఏ విషయంలోనూ తల్లిదండ్రులను పట్టించుకోరు. పేరెంట్స్ మాట వినకపోతే యువతీ యువకులు ఎంత నష్టపోతారో మనం రోజూ చూస్తునే ఉన్నాం. ముఖ్యంగా అబ్బాయిల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగాను, కొంత కఠినంగానూ వ్యవహరించాలి. టెన్త్‌క్లాస్‌కు వచ్చేవరకూ జాగ్రత్తగానే ఉన్నా, ఇంటర్‌కి వచ్చేసరికి చాలామంది యువకుల్లో కొంత బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం కనిపిస్తాయి. ఆ తరువాత వాళ్లు డిగ్రీ చదువులకు వచ్చేసరికి అదుపుతప్పే పరిస్థితి కనిపిస్తుంది. కొందరు చెడు సావాసాల వల్ల వ్యసనాలకు అలవాటు పడుతుంటారు. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం, మితిమీరి సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ వాడడంతో చదువును నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ వయసులో పిల్లలను పేరెంట్స్ ఓ కంట కనిపెడుతూ అదుపులో ఉంచాలి.
- వై.అనసూయ, గుంటూరు

విదేశీ సంస్కృతిపై మోజు
నేడు చాలామంది యువతీ యువకులు పాశ్చాత్య సంస్కృతిపై మొగ్గుచూపుతూ మన సంప్రదాయాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాన్ని అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటున్నారు. తెలుగు సంవత్సరాది ‘ఉగాది’ని సంప్రదాయబద్ధంగా జరుపుకునేందుకు మాత్రం నేటి యువత ఇష్టపడడం లేదు. ‘వాలెంటెన్స్ డే’ వంటి విదేశీ వేడుకలపై మోజు చూపుతూ తెలుగు పండగలను మరచిపోతున్నారు. జనవరి 1న ఎలా గడపాలన్న విషయమై వారం రోజుల ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, ఇటీవల ఇంగ్లీషు సంస్కృతి పుణ్యమాని కొంత మేలు కూడా జరుగుతోంది. ఫాదర్స్ డే, మదర్స్ డే వంటి వేడుకల వల్ల ఏడాదికి ఒకసారైనా తల్లిదండ్రుల గురించి ఆలోచించాలన్న ఆలోచన రావడం మంచిదే. డబ్బును, కాలాన్ని వృథా చేసే విదేశీ వేడుకలకు మాత్రం మన యువత దూరంగా ఉండాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం