ఉత్తరాయణం

రాహుల్ విదూషక పాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయంగా ఏ మాత్రం పరిపక్వత లేని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై చేస్తున్న ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. నోట్లరద్దు వ్యవహారంలో అవినీతి జరిగిందని, ఆ విషయాలను లోక్‌సభలోనే వెల్లడిస్తానని చెప్పిన రాహుల్ మాటలు ప్రజలందరికీ నవ్వు తెప్పించాయి. మోదీ ముడుపులు స్వీకరించినట్టు రాహుల్ ఆరోపించడం అవగాహనా రాహిత్యానికి నిదర్శనం. ఆధారాలున్నాయంటున్న రాహుల్ వాటిని ధైర్యంగా బయటపెట్టవచ్చు కదా! ముడుపులు తీసుకుంటే ఆ ధనాన్ని ఒంటరి వాడైన మోదీ ఏం చేసుకుంటారు? ‘కాంగ్రెస్ యువనేత మాట్లాడడం నేర్చుకున్నాడ’ని మోదీ అపహాస్యం చేసినా రాహుల్ వైఖరిలో మార్పు లేదు. సాక్షాత్తూ ప్రధాని మోదీని విమర్శిస్తే తనకు గుర్తింపు వస్తుందనే ఆలోచనతోనే రాహుల్ విదూషకుడి మాదిరి మాట్లాడుతున్నాడు. అవినీతి వల్ల కాంగ్రెస్‌కు ఎలాంటి గతి పట్టిందో కాంగ్రెస్ వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రభుత్వం చేసే మంచిపనులకు బాధ్యత గల విపక్షంగా కాంగ్రెస్ వారు సహకరించాలి. ఏదో విమర్శించాలి గనుక అవగాహన లేకుండా మాట్లాడడం వల్ల రాహుల్ పరువు బజారున పడుతోంది. నిజానికి మోదీని విమర్శించే స్థాయికి ఇంకా కాంగ్రెస్ యువరాజావారు ఎదగలేదు. కాంగ్రెస్ నేతలైనా రాహుల్‌కు తగిన శిక్షణ ఇవ్వాలి.
- కెవి రమణమూర్తి, కాకినాడ

బాధితులకు న్యాయం ఎప్పుడు?
అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులకు న్యాయం చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. వేలాది మంది ఖాతాదారులు కోట్లాది రూపాయల్లో నష్టపోయినప్పటికీ అగ్రిగోల్డ్ యాజమాన్యంపై విచారణ నత్తనడకన సాగుతోంది. యాజమాన్యానికి చెందిన స్థిర చరాస్తులను పోలీసులు జప్తు చేశారు. బాధితుల తరఫున పోరాడేందుకు ఏ రాజకీయ పార్టీలు ముందుకు రావడం లేదు. బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు కనిపించడం లేదు. అమాయక ప్రజలను మోసం చేసిన అగ్రిగోల్డ్ యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు ఇంకెన్ని ఏళ్లు పడుతుంది? సొంతింటి కలలు నెరవేర్చుకోవాలని డబ్బు దాచుకున్న వారికి నష్టపరిహారం ఎప్పుడు చెల్లిస్తారు? మోసగాళ్లను శిక్షిస్తామని, బాధితులను ఆదుకుంటామని పాలకులు చేసిన ప్రకటనలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి?
- వై.అనసూయ, గుంటూరు

నిర్లక్ష్య వైఖరి తగదు
ర్యాగింగ్‌ను నిషేధించినట్లు ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంకా ఎక్కడో ఒకచోట కళాశాలల్లో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. పోలీసులు హెచ్చరికలు చేస్తున్నా ర్యాగింగ్ పేరిట వేధింపులు కొనసాగుతున్నాయి. కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయి. ర్యాగింగ్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు వేసినపుడు మిగతా విద్యార్థులు భయపడతారు. విద్యార్థులకు కౌనె్సలింగ్, నైతిక విలువలపై ప్రత్యేక తరగతులు నిర్వహించాలి. ర్యాగింగ్‌ను నిషేధించినట్టు కళాశాలల్లో బోర్డులు పెట్టినా ఫలితం ఉండదు. మందలింపులతో కాకుండా నిందితులకు జైలుశిక్షలు, కళాశాల నుంచి బహిష్కరించడం వంటివి అమలు చేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

ఉద్దానం - అధ్వానం
పిండ దశ మొదలు పండు ముదిమి దాకా
మా నెత్తిన సుడిగుండాలే
ఎందుకంటే
తీర ప్రాంతమనేమో?

మా రెండు మూత్రపిండాలూ
మండే వాయుగుండాలే
బలపడి, ప్రచండ తుపానుగా మారి
మాకు పిండాలే పెడతాయో
జాలిపడి, బాధ్యత పడి
అండాదండగా ఉంటాయో
అంతా అయోమయమే!

ఈ మట్టిలో పుట్టిన ప్రతిమనిషీ
ఒక్కో కొబ్బరిచెట్టు
కన్నీళ్లు ఉప్పుటేళ్ళుగా పొంగినపుడు
కళ్ళు కాదు, ఉబ్బేది... కిడ్నీలే
ఎండిన కొబ్బరి బోండాల్లా.. వెన్నంటే ఉంటూ

డయాలసిస్ సెంటర్లూ, ఆధునాతన శ్మశానాలూ సరే!
ఉద్ధండ నేతలారా, మీ అభివృద్ధి ఎజెండాలో
మాకూ కొంత చోటివ్వండి
మా ఉబ్బిన మూత్రపిండాలు
ఉద్యమ జెండాలుగా మారక ముందే!
ఓ మాటివ్వండి
ఉద్దానంపై ప్రసరించే మీ చూపులో
చత్వారం ఉండబోదని.
- డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం