ఉత్తరాయణం

కాలుష్య నివారణ ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత పదేళ్ల కాలంలో లారీలు, బస్సులు, కార్లు, బైక్‌లు, ఆటోలు, వ్యాన్‌లు, ఇతర వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ వాహనాల వల్ల వాయు, శబ్ద కాలుష్యాల శాతం వృద్ధి చెందుతోంది. పల్లెల నుంచి నగరాల వరకూ మెకానిక్ షెడ్‌లు, లారీ షెడ్‌లు, వెల్టింగు షాపుల్లో పనుల వల్ల వాయు, శబ్ద కాలుష్యాలు ప్రజలకు ఇబ్బందికరంగా పరిణమించాయి. చెవుడు, గుండె జబ్బులు, నిద్రపట్టక పోవడం, తలనొప్పి, ఎలర్జీలు వంటి అనారోగ్యాలు చాలామందికి వస్తున్నాయి. వాయు, శబ్ద కాలుష్యాలు నియంత్రణకు సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకోవాలి.
- జె.సుధాకరరావు, కాకినాడ

పేదలకూ రుణమాఫీ
పెద్దనోట్లు రద్దయి నెలలు గడుస్తున్నా ప్రజల కష్టాలు తీరడం లేదు. ఇంకా బ్యాంకులు, ఎటిఎంల వద్ద జనం అసహనంగానే ఉంటున్నారు. ప్రభుత్వం ముందు చూపులేకుండా నోట్లను రద్దుచేసి పెద్ద తప్పుచేసింది. 500,1000 నోట్లలో ఏదో ఒకదానిని రద్దుచేసి వుంటే ఇంత రాద్ధాంతం జరిగి వుండేది కాదేమో. నల్లకుబేరుల దగ్గరవున్న ధనాన్ని స్వాధీనం చేసుకుని నిరుపేదల ఖాతాల్లో 15 లక్షలు చొప్పున ప్రభుత్వం వేస్తుందన్న ప్రచారం జరిగింది. అంత సొమ్మును ఉత్తపుణ్యానికి పేదల ఖాతాల్లో వేయనక్కర్లేదు. పేదలు, చిరు వ్యాపారులు తీసుకున్న బ్యాంకు రుణాలను రద్దు చేస్తే వారికి ఎంతో మేలు జరుగుతుంది. వ్యవసాయ రుణాలు, పెన్షన్ లోన్లు, ఇంటిని తాకట్టుపెట్టడం, చదువుల కోసం, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోడానికి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తే చాలు. ఇది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది.
- షహానాజ్, అనంతపురం

నగదు రహితం వద్దు
నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్న మన దేశంలో నగదు రహిత ఆర్థిక లావాదేవీలు సాధ్యపడతాయా? ప్రతి చిన్నమొత్తానికి ఈ విధానం అమలు జరుగుతుందా? సైబర్ నేరాలకు ఎక్కువ ఆస్కారం ఉంది. నగదు రహిత లావాదేవీలు జరిగితే బ్యాంక్ ఖాతాల నుండి డబ్బులు ఎలా మాయవౌతున్నాయి. సైబర్ నేరగాళ్ల నుండి అమాయక ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది. టెక్నాలజీ ఉపయోగం తెలియని వారికి ఇది మరింత ప్రమాదం. నిరక్షరాస్యులైన ప్రజలను చైతన్యపరచడానికి చాలా కాలం పడుతుంది. పెన్షన్లు పొందే వృద్ధులు, వికలాంగులకు నగదు రహిత విధానం ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి.
- అయినం రఘురామారావు, ఖమ్మం

తెలుగుపై శ్రద్ధ ఇదేనా?
రాష్ట్ర విభజన జరిగి రెండున్నరేళ్లు గడచినప్పటికీ ఎపికి ప్రత్యేకంగా తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయకపోవడం సరికాదు. తెలుగు భాష అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నట్టు ఎపి సర్కారు గొప్పగా ప్రకటిస్తున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు. తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ కార్యకలాపాలు ఇంకా హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయి. వెంటనే ఈ సంస్థలను విభజించి నవ్యాంధ్రలో పరిపాలనా కార్యాలయాలను ఏర్పాటు చేయాలి. వచ్చే ఉగాది నాటికైనా వీటి విభజనను పూర్తి చేయాలి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషాదినోత్సవాలను వైభవంగా జరుపుకున్నంత మాత్రాన ప్రయోజనం ఉండదు. అధికార భాషా సంఘానికి అధ్యక్షుడిని 2015 ఆగస్టులో నియమించినా ఇంకా సభ్యులను నియమించలేదు. 2014 ఏప్రిల్ నుంచి ఎపిలో అధికార భాషా సంఘం ఉనికే లేకుండా పోయింది.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

ప్రమాణాలు తగ్గిన విద్య
ఒకప్పుడు ఎంతో పవిత్రంగా అందరూ భావించిన విద్యావ్యవస్థ నేడు వ్యాపారమయమైంది. పిల్లలకు పుస్తకాల బరువు, తల్లిదండ్రులకు ధనభారం మోయలేనంతగా పెరిగిపోతున్నది. విద్యాశాఖ అసమర్ధతకు, పాలకుల చేతకాని తనానికి నిదర్శనంగా విద్యా వ్యాపారం సర్వత్రా వర్ధిల్లుతోంది. లిక్కర్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు ఇపుడు విద్యావ్యాపారంలో పాలుపంచుకుటున్నారు. ఒకప్పుడు లాభనష్టాలతో సంబంధం లేకుండా సేవా దృక్పథంతో నగరాల్లో అక్కడక్కడ ప్రైవేటు విద్యాసంస్థలు ఉండేవి. ఇపుడు పల్లెల్లోనూ కానె్వంట్ల జోరు పెరిగింది. విద్యావ్యాపారానికి కళ్లెం వేయపోతే విపరీత పరిణామాలు మరింతగా చోటుచేసుకుంటాయి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు