ఉత్తరాయణం

‘హోదా’ అడగడం పాపం కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జల్లికట్టు’ పోరాటానికి, ప్రత్యేక హోదాకు పోలికేమిటని ఎపి సిఎం చంద్రబాబు మండిపడడం భావ్యం కాదు. కేంద్రంతో వ్యవహారం గనుక ఎపికి ప్రత్యేకహోదా సాధించడం అసాధ్యమని ఆయన భావించి ఉండాలి. జల్లికట్టు కోసం పోరాడిన తమిళ యువత నుంచి స్ఫూర్తి పొంది తెలుగు యువత అదే తీరులో ఉద్యమిస్తే రాష్ట్రం పరువు పోతుందని చంద్రబాబు అనుమానించడం అర్థరహితం. తమ వంతు స్పందనగా యువత శాంతియుత ప్రదర్శనలు జరిపినంత మాత్రాన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతాయా? ఎన్నో విషయాల్లో మంచి ర్యాంకులు సాధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి సందేహాలు రాకూడదు. ప్రత్యేక హోదా అడగడం పాపమూ కాదు, ప్యాకేజీ ‘అద్భుత దీపమూ’ కాదని పాలకులు తెలుసుకోవాలి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత కోసం దిల్లీలో మంత్రుల చుట్టూ తిరుగుతూ అర్జీలు పెట్టుకునే అవస్థ ఎందుకు? రాష్ట్ర విభజన తర్వాత ఎపి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలుకానంత వరకూ ఈ దుస్థితి తప్పదు. రాష్ట్రానికి రావలసిన న్యాయమైన హక్కు ‘ప్రత్యేక హోదా’. దాన్ని కోరడానికి ముహుర్తాలు, మొహమాటాలు ఎందుకు? ‘హోదా’ కోసం రాష్ట్రం యావత్తూ నినదించాల్సిన విషయంలో శషభిషలు దేనికి?
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం

అర్చకులను ఆదుకోండి
ఆలయ ఉద్యోగుల, అర్చకుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పిన తెలంగాణ సిఎం కెసిఆర్ తన హామీలను వెంటనే అమలు చేయాలి. అవసరమైతే శాసనసభలో బిల్లు పెడతామని కూడా సిఎం అభయం ఇచ్చారు. ఒకేపనికి ఒకే రకమైన వేతనం అంశంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అర్చకులకు, ఉద్యోగులకు జీతాలను నేరుగా చెల్లించాలి. అవసరమైతే చట్ట సవరణ చేసైనా ముఖ్యమంత్రి తన మాటను నిలబెట్టుకోవాలి. చట్టపరిధిలో కాదని దాటవేయడం భావ్యం కాదు. ఇప్పటికే ఎన్నో సామాజిక వర్గాల సమస్యలను పరిష్కరించిన కెసిఆర్ అర్చకులకు న్యాయం చేసేందుకు చొరవ చూపాలి. నిబంధనలను సడలించైనా ఆలయ ఉద్యోగులు, అర్చకుల సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించాలి.

- సివిఆర్ కృష్ణ, హైదరాబాద్

మితిమీరిన నజరానాలా?
ఎపి నుంచి ఎవరైనా నోబెల్ బహుమతి సాధిస్తే ప్రభుత్వం తరఫున వంద కోట్ల రూపాయల నగదు బహుమతి అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. ఇంతపెద్ద నజరానా ఇచ్చినా ఆ నోబెల్ విజేత స్వరాష్ట్రానికి చేసిన సేవ ఏమిటి? అంతటి ఖ్యాతి పొందిన వ్యక్తి ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఇక్కడ అభివృద్ధి జరిగేలా పాటుపడగలడా? రాష్ట్రం కోసం పనిచేస్తామని ప్రమాణం చేసినపుడే ఇలాంటి నజరానాలు ఇవ్వాలి. అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నజరానాలు ఇవ్వడం పరిపాటైంది. ప్రజాధనాన్ని ధారాళంగా ఇవ్వడాన్ని కొంత తగ్గిస్తే బాగుంటుంది.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

ఇదేం వాదన..‚
కట్నం తీసుకున్నా, ఇచ్చినా నేరమే. ఇటీవల తిరుపతిలో జాతీయ సైన్స్ కాంగ్రెస్ మహాసభలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు వింత వాదన వినిపించారు. మగవారే కట్నం ఇచ్చే రోజులు వస్తాయని ఆయన అనడం సరికాదు. కట్నం అనేది భారతీయ వివాహ వ్యవస్థలో ఒక దురాచారం. కట్నకానుకలు ఇవ్వలేక ఎంతోమంది ఆడపిల్లల తల్లిదండ్రులు నానాపాట్లు పడుతున్నారు. ఒక నేరం పోయి, మరో నేరం వస్తే సమన్యాయం సాధించినట్టా? మగవారు కట్నం ఇవ్వాల్సి వస్తే మహిళలకు న్యాయం దక్కినట్టా? కట్నం అడిగే మగవారికి పెళ్లికాని రోజులొస్తాయి అని చంద్రబాబు అని వుంటే బాగుండేది.
-్ధర్మతేజ, గొడారిగుంట