ఉత్తరాయణం

మోయలేని ధరల భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యావసర సరకుల ధరలు భారంగా మారినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం. కొన్నింటికి సంబంధించి ప్రభుత్వాలే ధరలు పెంచడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తరచూ పెంచుతున్నారు. విద్యుత్ చార్జీలను మరోసారి పెంచాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ప్రజలు తప్పనిసరి అని భావించే వస్తువుల, సేవల ధరలను ఇలా పెంచడం భావ్యం కాదు. పండుగ సీజన్ వచ్చిందంటే ఆర్టీసీ బస్సు చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. హోటళ్లలో సర్వీస్ టాక్స్‌ను విధిస్తున్నారు. సినిమా ధియేటర్లలో రేట్లు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. నగదు రహిత లావాదేవీల పేరిట కొత్తపన్నులు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పరీక్ష ఫీజులు, స్కూల్ ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేదు. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడంలో విఫలమవుతున్న పాలకులు ధరలను తగ్గించడంలో ఎలాంటి శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వమే దోపిడీకి పాల్పడుతుంటే ఇక ప్రైవేటు సంస్థలు బరితెగించవా?
- ఎ.రఘురామారావు, ఖమ్మం