ఉత్తరాయణం

అంతం లేని అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవితాలను జీతాలతో సరిపెట్టుకోలేక ధన దాహంతో అవినీతికి పాల్పడుతూ లంచాలకు ఆశపడి చివరకు పట్టుబడుతున్నారు అనేక మంది అధికారులు. అయనా ఇంకా ఎంతోమంది లంచావతారాలు పుడుతూనే ఉన్నారు. నోట్ల రద్దుతో నల్లకుబేరులు ఎంతమంది బయటపడ్డారో, పత్రికలు ప్రచురించిన వార్తలు ఎంత సత్యమో ఆ దేముడికెరుక. ప్రధాని మోదిగారు చేపట్టిన స్వచ్ఛ్భారత్ అంటే రోడ్లు శుభ్రంగా ఉండడమే కాదు, న్యాయం, ధర్మం ప్రకారం ప్రజలు, నాయకుల, ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరులు నడుచుకోవడమే నిజమైన స్వచ్ఛ భారత్. దేవాలయాల సందర్శనం, దీక్షలు బూనడం, వ్రతాలు, పూజలు చేస్తూ ధర్మానికి దూరంగా ఉండేవారిని దైవం ఉపేక్షించదనే వాస్తవం తెలుసుకోవాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

అన్ని పార్టీల తీరూ అంతే
ప్రజలు రాజకీయ నాయకులవల్ల పదే పదే మోసపోతున్నారు. అన్ని పార్టీలు ఆయా పార్టీల్లో పనిచేస్తున్న నాయకులు ఒకే జాతికి చెందిన వారని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఒక పార్టీలోకాకపోతే మరొక పార్టీలోనయినా మంచి వారు నిజాయితీపరులు ఉండకపోతారా అని అనుకుంటారు. అలాఅనుకునే ఎన్నికలు వచ్చినప్పుడల్లా అధికార మార్పిడి చేస్తుంటారు. తమను నిర్లక్ష్యంచేసిన వారిని తిరస్కరిస్తూ, వేరే పార్టీకి లేదా పార్టీల కూటములకు ఓటువేస్తుంటారు. అధికారంలోకి తెస్తుంటారు. కాని అన్ని పార్టీల విధానాలు, పనిచేసే తీరు ఒకలానే ఉంటాయని, అధికారంలోకి వచ్చాక కాని తెలుసుకోలేకపోతున్నారు. ప్రజాభిమానంతో అధికారంలోకి అహంకారాన్ని ఆ ప్రజల మీదనే ప్రదర్శిస్తుంటారు. ప్రజలను వంచిస్తుంటారు. వీరివల్లనేగదా మనం అధికారంలోకి వచ్చాము. పదవి వచ్చింది అని ఏ రాజకీయ నాయకుడు వారికి సహాయ సహకారాలు అందించటం లేదు.
- వులాపు బాలకేశవులు, గిద్దిలూరు

ఫ్లెక్సీలపై అంత మోజెందుకు?
దేశంలో నాయకులకు ఫ్లెక్సీల మోజు అంతమయ్యేదెప్పుడు?. అయినా అంత మోజు ఎందుకు? మోజు వున్న నాయకులు వాళ్లనుకున్నదే తడవు తిరుగులేదు కాబట్టి కార్యక్రమాల సందర్భంలో పెట్టుకోండి. పనికాగానే రెండో లేక మూడో రోజో తియ్యించండి. అంతేకాని నెలల తరబడి వీధుల్లో వ్యాపార సంస్థలకు, ఇళ్లకు అడ్డంగాపెట్టి ఇబ్బందులు కలిగించటం, కలిగించకూడదని ఆ మాత్రం విజ్ఞత, వివేకం తెలియదా? వీటివల్ల ప్రమాదాలు జరుగుతాయని ఇంగితం ఉండదా! పార్టీని, ప్రభుత్వాన్ని నడిపే నాయకులు పాలకులకు వీటవల్ల ఇబ్బందుల గురించి, తొలగించమని ఒకరు చెప్పాలా? హైకోర్టు చెప్పినా వినరా! ఇలాంటి విషయాల్లో కార్యకర్తల అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయండి.
- పొట్టి వెంకట శివప్రసాదరావు, అద్దంకి

కరువైన భద్రత
మన దేశంలో రహదారి భద్రత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరివల్ల ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వివిధ పట్టణాలలో మరియు జాతీయ రహదారుల వెంట ప్రమాదాల సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం నడిపే ప్రజారవాణా సంస్థలు, ట్రావెల్ సంస్థలు ఇంకా టాక్సీలను నడిపేవారు సరైన ప్రమాణాలు పాటించకపోవడం, ప్రమాదాలు జరిగిన తరువాత క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చటంలో ఆలస్యం తదితర కారణాలవల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది.మద్యం తాగి వాహనాలు నడిపేవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. రహదారుల వెంట మద్యం దుకాణాలపై నిషేధం అమలుచేయాలని భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నా అది అమలుకావటం లేదు.
- కప్పగంతు వెంకటరమణమూర్తి, సికిందరాబాదు