ఉత్తరాయణం

జగన్ పిల్లచేష్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఇటీవల బైఠాయించిన సందర్భంగా విపక్ష నేత, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ పోలీసు అధికారులను బెదిరించిన తీరు పిల్లచేష్టలను తలపించాయి. ‘మీరు సిఎంను టచ్ చేస్తున్నారు.. నా రాజకీయ హక్కులను హరిస్తున్నారు.. రెండేళ్లలో నేనే ఎపి సిఎం అవుతా.. ఇప్పుడు నన్ను అడ్డుకున్న పోలీసులందర్నీ గుర్తుంచుకుని అప్పుడు వారి పనిపడతా.. మీలో ఎవర్నీ మరచిపోను.. మీ అందరి సంగతి చూస్తా..’- అని యువనేత జగన్ నోరు పారేసుకోవడం అతనికి రాజకీయ పరిణతి లేదని చెబుతోంది. ఉడుకుమోతు పిల్లాడి ఆక్రోశంలా అతని ప్రవర్తన ఉంది. రాజకీయంపైన, ప్రజాస్వామ్యంపైనా అవగాహన లేని వ్యక్తి విపక్ష నేతగా ఎలా రాణిస్తాడు? ‘దేవుడు దయతలిస్తే కొన్ని నెలల్లోనే సిఎంగా వస్తా’ అని తరచూ జగన్ చెబుతున్న మాటలు విని జనం నవ్వుకుంటున్నారు.

- శాంతిసమీర, వాకలపూడి

ఇదేం సంప్రదాయం?
సంప్రదాయం పేరిట అత్యంత ప్రమాదకరమైన జల్లికట్టు క్రీడకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇవ్వడం సమంజసం కాదు. కేవలం రాజకీయ కోణంలోనే ఈ ఆర్డినెన్స్‌ను ఆగమేఘాలపై విడుదల చేశారు. జల్లికట్టు ఆటలో ఎద్దుల వెంట పరిగెత్తే యువకులు గాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు. ఎద్దులు కూడా పలురకాలుగా హింసకు గురవుతున్నాయి. ఆర్డినెన్స్ ఇచ్చాక జరిగిన తొలి జల్లికట్టు పోటీలో ఇద్దరు మరణించారు. జల్లికట్టును అనుమతించాలని రాజకీయ పార్టీలు, సినీ నటులు తమిళ యువతకు మద్దతు పలకడం సరికాదు. ప్రమాదకరం అని తెలిసి కూడా ఇలాంటి ఆచారాలను, సంప్రదాయాలను ప్రోత్సహించడం ఎందుకు? ఇలాంటి ప్రమాదకర క్రీడలకు అనుమతించాలని ఇపుడు కేరళ, కర్నాటకలోనూ ఉద్యమిస్తున్నారు. ‘నిబంధనల మేరకు’ ఈ ఆటలను అనుమతించాలని అనడం అర్థం లేని మాట.

- ఎం. వెంకటరావు, హైదరాబాద్

మత మార్పిడులు వద్దు
మత మార్పిడుల పేరిట దేశంలో ఎలా అశాంతి రగులుకుంటోందో, హిందువులకు ఎలా అన్యాయం జరుగుతోందో ‘మతమార్పిడి.. ఓ మహమ్మారి’ వ్యాసంలో సామవేదం షణ్ముఖశర్మ వివరించిన తీరు అభినందనీయం. మతం కన్నా మానవత్వం గొప్పదని అందరూ గ్రహించాలి. మా మతమే గొప్పదని కొందరు వాదనలకు దిగడం, మత మార్పిడులు చేయించడం మూర్ఖత్వానికి పరాకాష్ఠ. దేవుళ్లలో పోటీ లేదు. కానీ, ఆధిపత్యం కోసం కొన్ని మతాల వారు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎన్నికల సమయంలో కులమతాల పేరుతో ఓటర్లను ప్రలోభపెట్టరాదని ఇటీవల సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ ఎన్నికల ప్రచారం మతాన్ని, కులాన్ని వాడుకుంటున్నారు. ప్రపంచంలోనే ఉన్నతమైన హిందూ మతంపై కొందరు అకారణంగా అక్కసు వెళ్లగక్కుతూ సామరస్య వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. చెప్పులపై, డోర్‌మ్యాట్లపై, లోదుస్తులపై హిందూ దేవతల బొమ్మలను ముద్రించడం దారుణం. ఇలాంటి చర్యలకు దిగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. డబ్బును, ఇతర ప్రయోజనాలను ఎరగా వేసి మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నందునే మత సామరస్యం దెబ్బతింటోంది.
- కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి