ఉత్తరాయణం

తమిళనాట సస్పెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడులో పాలనాధికారం ‘చిన్నమ్మ’గా పిలవబడే శశికళ చేతికి వచ్చేసినట్టేనా? పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో శాసనసభాపక్ష నాయకురాలిగా శశికళ ఎన్నిక కావడం అంతా శరవేగంతో జరిగినట్టు కనుపించినా, అనూహ్యమైనది మాత్రం కాదు. జయలలితకు ముప్ఫై ఏళ్ళుగా నీడలా వ్యవహరించిన శశికళకు పార్టీవర్గాల విధేయత విజయవంతంగా బదిలీ అయినట్టే. ఎలాంటి ప్రత్యక్ష రాజకీయ అనుభవం లేని, ప్రజల నుంచి ఎన్నిక కాబడని వ్యక్తికి ఇలా రాజకీయ, పాలనా అధికారాలు కట్టబెట్టడం అరవ సినిమాల్లో అతి ఉద్వేగాలను గుర్తుచేస్తున్నా, ఆ తరహా సంస్కృతికి అతీతంగా మసలే పార్టీలను దేశంలో వేళ్ళమీద లెక్కించవచ్చు. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్య రీతుల్ని గమనిస్తే ఇది మామూలు విషయమే. అయితే, సిఎం పదవి చేపడితే చిన్నమ్మకు సవాళ్లు మాత్రం సవాలక్ష ఉంటాయి. అందులో మొదటిది అక్రమాస్తుల కేసు. ఈ కేసుకు సంబంధించి- వచ్చేవారం వెలువడే సుప్రీం కోర్టు తీర్పు ఆమెపై పూలవాన కురిపిస్తుందో, రాళ్ళవాన కురిపిస్తుందో? రాజకీయ వైరిపక్షాలు పాలక పార్టీని బలహీనపరచడానికి ప్రయత్నాలు చేస్తాయి. భాజపా తమిళనాడులో కాలూన్చడానికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘అధికారం, ఆధ్యాత్మికత’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం రాజకీయ సన్నాహాల్లో భాగం కావొచ్చు. అధికార పక్షంలో మునుపటి క్రమశిక్షణ ఆశించడం అత్యాశే. మొత్తానికి తమిళ రాజకీయ చిత్రంలో అసలైన సస్పెన్స్ అందరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
- డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం

‘ఇస్రో పండుగ’ జరపండి
కుర్రాళ్లు కళ్లు తెరవాలి.. యువత మేల్కొనాలి.. ‘ఖైదీ నెంబర్ 150’, ‘శాతకర్ణి’, కోడి పందాలు.. ఇవేనా..? మన తెలుగుగడ్డపై జరుపుకునే పండుగలు. కాదు.. కాదు.. అసలైన పండుగ ముందుంది చూడండి. ఫిబ్రవరిలో తెలుగుగడ్డ వైపు యావత్ ప్రపంచం చూడబోతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏకంగా ఒకే రాకెట్ ద్వారా 103 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపబోతుంది. ఇది ఎంతో అరుదైన సంఘటన. ప్రపంచ దేశాలలో యువత, విద్యావంతులు, మేధావులు అంతా ఈ విషయంపైనే చర్చించుకుంటుంటే- ప్రయోగం జరుగుతున్న మన తెలుగు రాష్ట్రాలలో దాని ధ్యాస, జాడేలేకపోవటం ఆశ్చర్యకరం, విచారకరం. దేశానికి పేరుతెస్తూ, దాదాపు 1500 కోట్ల ఆదాయం తేబోతున్న ఇస్రో శాస్తజ్ఞ్రుల ఘనతపై మనం సంబరాలు మిన్నంటేలా చేసుకోవాలి. వేనోళ్ళ పొగడాలి.. యువత ఈ విషయాలపై దృష్టి సారిస్తే వారి సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుంది. తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యావంతులు, మేధావులు, మీడియా దీనిపై ఆసక్తిపెడితే శ్రద్ధచూపితే.. భవిష్యత్‌లో ఎంతోమంది శాస్తజ్ఞ్రులు ఇక్కడి నుంచి ఉద్భవిస్తారు. అసలైన సాంకేతిక సంబరాలు మననుండే ఆరంభం కావాలి. అవి విశ్వవ్యాప్తమై విజయకేతనం ఎగురవేయాలి.
- టి.సురేష్‌కుమార్, మందరాడ (శ్రీకాకుళం)