ఉత్తరాయణం

మాదిగ కార్పొరేషన్ ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రంలో ఉమ్మడి ఎస్.సి కార్పొరేషన్ వల్ల ఎస్‌సి కేటగిరీలోని మాల సోదరులే అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నారు. కాని ఎస్‌సి మాదిగలకు ఏ విధమైన ఉపకారాలు జరగడంలేదు. మాలలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. మాదిగలు, చర్మకారులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. నిరుపేదలైన మాదిగలు అన్యాయానికి గురియగుచున్నారు. ఏపి సి.ఎం కాపులకు, బ్రాహ్మణులకు కార్పొరేషన్‌లు ఏర్పాటుచేసి వారి అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మాదిగల, చర్మకారుల సంక్షేమం మరియు ఆర్థికాభివృద్ధి నిమిత్తం రాష్ట్రం లో ఎస్‌సి సబ్ ప్లాన్ నిధుల నుండి 12 వేల కోట్ల రూపాయలతో మాదిగ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినట్లయితే మాదిగలకు న్యాయం జరుగుతుంది.
- మందపల్లి సత్యం, రామచంద్రాపురం

సైనికులకు భద్రత కల్పించండి
కాశ్మీర్‌లోని గుంజ్ సెక్టార్‌లో మంచుకొండలు పడి 10మంది వీర జవానులు భారత గణతంత్ర దినోత్సవం నాడే సమాధి అవ్వడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిరంతరం దేశ భద్రత, సరిహద్దులలో వుంటూ రక్షణగా వుంటున్న వీర జవానుల భద్రత పట్ల మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి అవలంబించడం జరుగుతున్నది. గతంలో అనేక మార్లు మంచు చరియలకు వీరజవానులు బలవుతున్న సంఘటనలనుంచి గుణపాఠం నేర్చుకోనట్లుగా లేదనిపిస్తుంది పై సంఘటనను చూస్తుంటే. కావున ఇప్పటికైనా కేంద్రం మేల్కొని మంచు చరియలకు వీరజవానులు బలవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలి. వీరజవానుల భద్రత పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడి వారికి కూడా రక్షణ ఏర్పరచేలా చర్యలు తీసుకోవాలి. వీరజవానుల ఆత్మకి శాంతి కలగాలి.
- వేదుల జనార్దన్‌రావు, వంకావారిగూడెం

రేషన్ కోసం పాట్లు..
మేము పల్లెటూరువాళ్లం.. గ్రామాలలో వుండే పేదవారం... మాకు చదువు తక్కువ.. ప్రతి నెలా ప్రభుత్వం ఇచ్చే నిత్యావసరమైన బియ్యం, పంచదార, కిరసనాయిలు కోసం డీలరు వద్దకెళతాము. చాలామందిని చేతి ముద్రలు పడటం లేదని తిప్పి పంపుతారు. రేపు రండి, ఎల్లుండి రండి.. అంటూ పెద్ద పండుగ కోటాను ఇవ్వనే లేదు. ఇపుడు మరలా ఆధార్ కార్డు, గ్యాస్‌కార్డు, రేషన్ కార్డు నకళ్లు ఇమ్మంటున్నారు. గతంలో ఎన్నిసార్లు ఇచ్చామో హైదరాబాద్‌లో, ఢిల్లీలో వున్న పెద్ద దొరబాబులకు తెలియదు. మా బతుకులు ఈ ఫోటోలు, ఆధార్ నకళ్లు ఇవ్వడంతోనే సరిపోతుంది. పెద్దబాబులు విమానాల్లో తిరుగుతారు మహానుభావులు. మా కష్టాలు అర్థం చేసుకునేవారేరి? ఇలా బాధలు పెట్టడం భావ్యమేనా?
- చెన్నంశెట్టి నారాయణమ్మ, ఉండి, ప.గో.జిల్లా

ట్రంప్ వైఖరి సబబే
తీవ్రవాదులను నిలువరించడానికి అమెరికా నూతన అధ్యక్షుడు చేపట్టిన చర్యలు సమంజసమే. కొన్ని ముస్లిం దేశాల నుంచి వచ్చేవారిపై ఆంక్షలు విధించడం సబబే. ఎన్నికల హామీల అమలులో భాగంగా ఆయన తీసుకున్న చర్యపై విమర్శలు వస్తున్నా నాయకత్వం మారినప్పుడు విధానాల్లో మార్పు సహజమే. దీనినే ఛేంజ్ మేనేజ్‌మెంట్ అని అంటారు. మనదగ్గర కూడా సర్జికల్ స్రైక్స్, నోట్ల రద్దు చేసినప్పుడు విమర్శలు పెద్దఎత్తునే వచ్చాయి. ఫలితాలు బాగుండటం వల్ల అంతా మోదీని మెచ్చుకున్నట్లే రేపోమాపో ట్రంప్‌కు అమెరికన్లు మద్దతు ఇస్తారు.
- ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్