ఉత్తరాయణం

భారత్ ఇక సూపర్ పవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇస్రో’లా ఘన విజయాలు నమోదు చేసే ఓ పది సంస్థలుంటే చాలు ప్రపంచంలో మన దేశమే ‘సూపర్ పవర్’గా ఆవిర్భవించడం ఖాయం. అన్ని దేశాలూ అబ్బురపడేలా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ‘ఇస్రో’ ప్రవేశపెట్టడం ఓ అద్భుతం. భారత్ గర్వపడేలా ఈ విజయాన్ని సాధించిన ‘ఇస్రో’ శాస్తవ్రేత్తలు అభినందనీయులు. ఈ తాజా ప్రయోగంతో అంతరిక్ష విజ్ఞానంలో భారత్ అద్వితీయ శక్తిగా మరోసారి నిరూపించుకుంది. అంతరిక్ష ప్రయోగాలే కాదు, పరిమిత నిధులను సమర్ధవంతంగా వినియోగించుకోవడంలోను మన ‘ఇస్రో’ మిగతా దేశాల కన్నా చాలా ముందంజలో నిలిచింది. ఇలాంటి ప్రయోగాల వల్ల అంతరిక్ష వాణిజ్యం ద్వారా కూడా దేశానికి లాభం చేకూరుతుంది. ఈ విజయం మిగతా రంగాలకు స్ఫూర్తికావాలి. దేశంలో సైన్స్ అధ్యయనానికి, పరిశోధనలకు ప్రభుత్వం నిధుల కేటాయింపులను పెంచాలి. పరిమిత వనరులతోనే అద్భుతాలను సాధిస్తున్న భారత అణుశక్తి రంగం దేశ ప్రగతికి మార్గదర్శి.
- డా. జివిజి శంకరరావు, పార్వతీపురం

చేష్టలుడిగిన నేతలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించినపుడు అడ్డుకోలేని కాంగ్రెస్, బిజెపి నేతలు నేడు ప్రత్యేక హోదా కోసం ఎలాంటి ఉద్యమాలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ ఇంతవరకూ ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి- ‘రాజకీయాల్లో ఉత్తరాది నేతల ఆధిపత్యమే’ కారణం. ప్రత్యేక హోదా ఇక లేనట్టేనని బిజెపి వారు చతికిలపడిపోయారు. రాష్ట్ర విభజనకు కారకులైన కాంగ్రెస్ వారు ఇక చేసేదేమి లేక చేతులెత్తేశారు. ఎప్పుడో ఒకటీ అరా ప్రదర్శనలు చేయడం వల్ల ఏపికి ప్రత్యేక హోదా రాదు. బలమైన ఉద్యమం లేనందున నేడు ప్రత్యేక హోదా డిమాండ్ మరుగున పడుతోంది. కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేక అధికార టిడిపి నేతలు వౌనం వహిస్తున్నారు. ప్రత్యేక హోదా వల్ల కంటే ‘ప్యాకేజీ’ వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని టిడిపి నాయకులు సెలవిస్తున్నారు. గత ఏడాది ప్రకటించిన ఆ ‘ప్యాకేజీ’లో వరాలు ఏపికి దక్కడం లేదు. అధికార, విపక్ష పార్టీలు ఇలా నీరుకారిపోవడంతో ఏపికి ప్రత్యేక హోదా పగటికలే అని తేలిపోయింది. హామీలను విస్మరిస్తే కాంగ్రెస్‌కు పట్టిన గతే మిగతా పార్టీలకూ పడుతుంది.
- కంపాటి రాజేంద్రకుమార్, నూజివీడు

పిఠాపురం రైల్వే లైన్‌పై జాప్యం వద్దు
తూర్పు గోదావరి జిల్లా వాసులు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న ‘కాకినాడ పోర్టు- పిఠాపురం రైల్వే మెయిన్ లైన్’ నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయాలి. ఈ లైన్ నిర్మాణానికి ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఈ నిధులను సకాలంలో విడుదల చేసి ట్రాక్ పనులను త్వరితగతిన చేపట్టాలి. ఇప్పటికే తీవ్ర జాప్యం జరగడంతో ఈ ప్రాంతీయులు ఎంతో నిరాశకు లోనయ్యారు. ప్రధాని మోదీ, ఏపి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిఠాపురం రైల్వే లైన్ పనులను వచ్చే బడ్జెట్ నాటికి పూర్తి చేయాలి. యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసి తూర్పు గోదావరి జిల్లా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలి.
- జె.సుధాకరరావు, కాకినాడ