ఉత్తరాయణం

అల్పాహారం ధరలకు రెక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల చాలా రైళ్లలో పాంట్రీకార్ ద్వారా విక్రయించే అల్పాహారం ధరలు సామాన్య, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండడం లేదు. ఆలూ చాప్ బోండాలు, మిరపకాయ బజ్జీలు, ఇడ్లీ, దోశ తదితర టిఫెన్లు కొనలేని పరిస్థితి నెలకొంది. ‘రైలు నీరు’ ప్రకటనలకే పరిమితం అయింది. ఇండియన్ రైల్ టూరిజం, క్యాటరింగ్ సెల్లర్స్ ఒక లీటర్ వాటర్ బాటిల్స్ లభించడం లేదు. కొంతకాలం క్రితం జనతా టిఫిన్ కేవలం 10 రూపాయలకే లభించేది. ఎగ్ బిరియానీ, లెమన్ రైస్, పులిహోర ధరలు అందుబాటులో లేవు. బి.పి, షుగర్, కీళ్ళనొప్పులు, తలనొప్పి వంటి అనారోగ్యాలను తగ్గించే సంప్రదాయ అల్పాహారాలు ప్రయాణికులకు అందుబాటు ధరల్లో లభించేలా రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలి.
-జె.సుధాకర్‌రావు, కాకినాడ

పదవీ లాలస..
కాంగ్రెస్‌లో అనేక ఉన్నత పదవులను అనుభవించి, తీరా ఆ పార్టీ కష్టకాలంలో ఉండగా, తనకేదో మర్యాద జరగడం లేదని కుంగిపోయి, వృద్ధాప్యం మీదపడినా ఏవో ఆశలతో బిజెపిలో ఎస్.ఎమ్.కృష్ణ చేరడం విడ్డూరం. పదవి మీద మోజుతో పార్టీలు మారుతున్న ఇలాంటి నేతలు దేశంలో ఎందరో ఉన్నారు. బిజెపి తీర్థం పుచ్చుకున్న కృష్ణ రేపు కాంగ్రెస్‌ను విమర్శించగలరా? ప్రజలెంత అసహ్యించుకుంటారు. అయినా, ప్రజలేమనుకుంటే మనకేమిటి? అనుకునే దళసరి చర్మం ఉన్న రాజకీయ నేతలే మనకు శరణ్యమా?
- ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్

బీసీ కమిషన్ ఎవరి కోసం?
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బీసీ కమిషన్ నామమాత్రమైనది. కమిషన్ చైర్మన్‌గా హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో పదవీ విరమణ చేసిన జడ్జీలను నియమించాలనే నిబంధనను సడలించింది. ఈ కమిషన్‌ను కేవలం ముస్లిం రిజర్వేషన్ల కల్పనకే ఏర్పాటు చేసినట్లు ఉంది. బీసీ జాబితాలోని వెనుకబడిన వర్గాలవారు కోల్పోతున్న అవకాశాలను కమిషన్ అధ్యయనం చేయాలి. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. సామాజిక, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం వంటి ప్రాతిపదికల ఆధారంగానే రిజర్వేషన్లు కల్పించాలి. ముస్లిం సమాజంలో ఎలాంటి కుల వివక్షలు లేవు. సామాజిక వెనుకబాటుతనం లేదు. ముస్లింల ప్రగతికి రిజర్వేషన్లు ఒక్కటే మార్గం కాదు. వారికి తగిన సంక్షేమ పథకాలు అందించాలి. ప్రజలందరూ సమైక్యంగా ఉండేలా చర్యలుండాలి. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఒరిగేదేమీ లేదు. రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం అనే అపవాదును కేంద్ర ప్రభుత్వంపై వేసేందుకు తెలంగాణ సర్కారు తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవనే సుప్రీం కోర్టు తీర్పును గౌరవించాలి.
-సామల కిరణ్, జూలపల్లి (పెద్దపల్లి జిల్లా)

పురాతన ఆలయంపై చిన్నచూపు
ఉత్తరాంధ్రలో అతి ముఖ్యమైన శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం దేవాదాయశాఖ నిర్లక్ష్యానికి ప్రతీకగా మారింది. నిత్యం స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వేలాదిమంది భక్తులకు సరైన భోజన, వసతి సౌకర్యాలు లేవు. ఆలయానికి చేరుకునేందుకు ముఖ్యమార్గం గోతులతో నిండి వుంది. ఆర్టీసీ బస్సు సౌకర్యం అధ్వానంగా వున్నందున ప్రైవేటు జీపులు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. విజయనగరం రోడ్డు మలుపులో వున్న డోలా మండపం శిథిలావస్థలో ఉంది. రథోత్సవం తర్వాత ఉభయ దేవేరులతో స్వామిని ప్రత్యేక పల్లకీలో తీసుకువచ్చి విశేష పూజలు జరిగే అతి పవిత్రమైన డోలా మండపం పరిస్థితి భక్తులకు భయాందోళనలు కలిగిస్తోంది. ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల పద్మనాభస్వామి క్షేత్రం అభివృద్ధికి దేవాదాయ శాఖ ఆసక్తి కనబరచకపోవడం బాధాకరం.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం