ఉత్తరాయణం

పన్ను సంస్కరణలతో మేలు జరిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లును పార్లమెంటు ఆమోదించడం ద్వారా దేశమంతటా ఏకరూప పన్ను విధానం- ప్రతిపాదనకు మోక్షం దొరికినట్లయింది. తద్వారా పన్ను మీద పన్ను, రాష్ట్రానికో పన్ను తరహా భేదాలు లేకుండా దేశమంతా ఒకే పన్ను అమలులోకి వస్తుంది. పరోక్ష పన్నుల్లో ఈ రకమైన సంస్కరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు నికర ఆదాయం సులభంగా చేరడమే కాకుండా, వస్తువుల రవాణా రాష్ట్రాల మధ్య పెరిగి వ్యాపారం, ప్రయివేట్ పెట్టుబడులు పెరుగుతాయి. అయితే- సామాన్యుడికి ఏ రకమైన ఊరట కలుగుతుందన్నది, కలిగినా ఎంత మేరకు అన్నది రాబోయే కాలమే చెప్పాలి. ‘పది బెత్తం దెబ్బల స్థానంలో ఒకే ఒక బడితె పూజ’ తరహాలో సామాన్యుడి పట్ల ఈ చట్టం ఉంటే మాత్రం ఆలోచించాల్సిందే. పరోక్ష పన్నులన్నవి పేద, ధనిక బేధం లేకుండా అందరినీ ఒకేలా చూస్తాయి. ఫలితంగా పేదవాడు ఎక్కువ నష్టపోయినట్టే, ఆదాయంతో సంబంధం లేకుండా సంపన్నులతో సమానంగా పన్ను కట్టాల్సి రావడం వల్ల వస్తువుల మీద, సేవల మీద పన్ను వడ్డించే ముందు సామాన్యుణ్ణే ప్రాతిపదికగా తీసుకోవాలి. ప్రస్తుత విధానంలో నాలుగు శ్లాబులున్నాయి. ఆహార పదార్థాలకు పన్ను మినహాయింపు, నిత్యావసరాలకు కనీస శ్లాబు కేటాయించడం మంచిదే. ఈ రాయితీ ఎంత కాలం, ఏయే వస్తువులపై ఉంటుందో చూడాలి. పెట్రోల్, తదితర ఇంధనాల్ని ఈ శ్లాబుల పరిధిలోకి తీసుకురానందున సామాన్యుడికి అధిక పన్నుల బాదుడు తప్పదు. ఒకప్పటిలా పన్నుల శ్లాబుల్ని మార్చే నిర్ణయం ఇప్పుడు పార్లమెంటుకి విశేషాధికారంగా లేదు. ప్రభుత్వం, జీఎస్టీ కౌన్సిల్ మార్చేయొచ్చు. కాబట్టి ఇది సామాన్యుడి మెడపై కత్తి లాంటిది. ఏదిఏమైనా పన్ను సంస్కరణలు ప్రనుత్వ రాబడిని పెంచుతాయి. ఆ రాబడి ఎలా ఉపయోగపడిందన్న విషయమే కీలకం. పరోక్ష పన్నుల సంస్కరణల కన్నా ప్రత్యక్ష పన్ను విధానం సంస్కరించడం, సరళీకరించడం అవసరం.
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం
దిగ్విజయ్ డబుల్ గేమ్..!
గవర్నర్ పిలిచేవరకు వెళ్లవద్దంటూ దిగ్విజయ్ సింగ్ తమని ఆపడం వల్లనే తాము అధికారం కోల్పోవలసి వచ్చిందని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రకటించాడు. గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తామన్నా దిగ్విజయ్ మాటను గౌరవించి తాము గవర్నర్ వద్దకు వెళ్లలేదని ఆయన అన్నాడు. మరి దిగ్విజయ్ మహాశయుడు- గోవాలో భాజపా సంకీర్ణానికి గవర్నర్ అవకాశం ఇవ్వడాన్ని నిరసిస్తూ రాజ్యసభలో నానా రభస చేశాడు. మరి ఇదేం డబుల్ గేమ్..? దీనికి దిగ్విజయ్ సమాధానం చెప్పాలి.
- సుధీర్, కాకినాడ
అన్ని రాష్ట్రాలకూ రుణమాఫీ
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ఉత్తరప్రదేశ్‌లో 46వేల కోట్ల రూపాయల మేరకు రైతులకు రుణమాఫీ చేయటం తప్పుడు చర్య. దేశంలోని అన్ని రాష్ట్రాల విషయంలో సమతుల్యం పాటిస్తూ రుణమాఫీని చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఏయే రాష్ట్రాల్లో కరువుకాటకాలు అధికంగా ఉన్నాయో సర్వేలు చేసి సంబంధిత ప్రాంతాల్లో రైతులకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు చేతికి రాక, దళారుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. వారికి రుణాలు ఇచ్చి, ఒక్కసారి కాకపోయినా అంచెలంచెలుగా మాఫీ చేయాలి. కష్టకాలంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది.
- అయినం రఘురామారావు, ఖమ్మం