ఉత్తరాయణం

రాష్టప్రతిగా అన్సారీ అభ్యర్థిత్వం మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం పూ ర్తికావస్తున్నందున రాష్టప్రతి స్థానానికి జరగబోయే ఎన్నిక అత్యంత కీలకం కానుంది. రాష్టప్రతి పదవికి ఎవరిని ఎంపిక చేయాలన్న విషయమై అపుడే భాజపా నాయకత్వం తర్జన భర్జన పడుతోంది. భాజపా సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషి, నజ్మా హెఫ్తుల్లా తదితరుల పేర్లు పరిశీలనకు వస్తున్నాయి. రాష్టప్రతి పదవిపై తనకు ఆసక్తి లేదని తాజాగా అద్వానీ ప్రకటించారు. పార్టీ వ్యక్తిని కాకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఈ పదవికి ఎంపిక చేయడం సమంజసం. ఉప రాష్టప్రతిగా రెండు పర్యాయాలు బాధ్యతలు చేపట్టి విమర్శలకు అతీతంగా పనిచేస్తున్న హమీద్ అన్సారీ అభ్యర్థిత్వాన్ని భాజపా నాయకత్వం పరిశీలించడం ఉత్తమం. గతంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ రెండుసార్లు ఉప రాష్టప్రతిగా పనిచేసి రాష్టప్రతిగానూ సేవలందించారు. అన్సారీని ఎంపిక చేస్తే దేశంలోనే అత్యున్నత పదవిని ముస్లిం మైనార్టీలకు మరోసారి ఇచ్చినట్లు మన సెక్యులర్ విధానం మరింత ప్రతిష్ట పొందే అవకాశం ఉంటుంది. వివాదరహితుడు, సౌమ్యుడైన అన్సారీ అభ్యర్థిత్వాన్ని రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వారూ ఆమోదించాలి.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్