ఉత్తరాయణం

వైద్య విద్య ఇంత ఖరీదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైద్య కళాశాలల నిర్వహణ ఖర్చులు పెరిగాయంటూ యాజమాన్యాలు పిజి వైద్య విద్య రుసుములను రు 5.80 లక్షల నుంచి రు.24.20 లక్షలకు పెంచడం, ఇందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల పాలకులు ఆమోద ముద్ర వేయడం ఎంతమాత్రం సమంజసం కాదు. న్యాయస్థానం జోక్యంతో ప్రస్తుతానికి ఈ నిర్ణయం అమలు లోకి రాలేదు. కానీ, వైద్య విద్యలో వ్యాపార దృక్పథం ప్రబలుతోందనడానికి 400 శాతం మేరకు రుసుములు పెంపు నిర్ణయం తిరుగులేని దృష్టాంతం. యాజమాన్యాల విజ్ఞప్తిని ప్రభుత్వాలు ఆమోదించడం అనేక సందేహాలకు కారణమవుతోంది. లక్షల కోట్ల రూపాయలు చెల్లించి వైద్య విద్య అభ్యసించిన విద్యార్థులు ఆ తరువాత అంతా తిరిగి రాబట్టుకోవాలని చూస్తారు. దీనివల్ల వైద్యం మరింత ఖరీదైనదిగా మారుతుంది. సేవా దృక్పథం కనుమరుగవుతుంది. ఇలాంటి పెడపోకడలను ఆదిలోనే తుంచివేయాల్సిన ప్రభుత్వాలు అందుకు వత్తాసు పలకడం బాధాకరం.
-ఉప్పలపు శేషునాథ్, పి.నైనవరం
ప్రకటన చేస్తే సరా?
ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘్భరోసా సభ’ వల్ల ఎంతమందికి కార్యకర్తలకు భరోసా కలిగిందో కానీ ఆ పార్టీ నేతలు మాత్రం నోటి దురద తీర్చుకున్నారు. 2019లో కేంద్రంలో తమ ప్రభుత్వం రాగానే ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని కాంగ్రెస్ యువనేత రాహుల్ అనడం ఎంత అవివేకమో ఆయనకు తెలియకపోయినా ఇతర నేతలకు తెలియదా? ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ‘హోదా’ ఇస్తామని రాజ్యసభలో అన్నారు. అది శిలాశాసనం లాంటిదే. దాన్ని అందరూ పాటించాల్సిందే అని మరో నేత చెప్పాడు. ప్రకటన చేయగానే సరిపోదు. దాన్ని పార్లమెంటులో ఉభయ సభలు ఆమోదించినప్పుడే శాసనం అవుతుంది. ‘హోదా’పై తాము ఇచ్చిన హామీ ‘సంతకం లేని వీలునామా లాంటిది’ అని రాహుల్‌కి తెలియదా?

- హితీక్ష, రమణయ్యపేట
తూతూ మంత్రం దాడులు..
తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టాక ఏపిలో ఎఱ్రచందనం స్మగ్లర్లపై దాడులు చేస్తూ, దొరికిన దుంగలను వేలం వేయగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నారు. అయితే, రాష్ట్ర సరిహద్దులో ఎఱ్ఱచందనం స్మగ్లర్లు, వ్యాపారుల కార్యకలాపాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వానికి దక్కాల్సిన సొమ్ము బయటకు పోతోంది. అటవీ, పోలీస్ శాఖల ఉద్యోగులు దాడులు చేస్తున్నప్పటికీ ఎఱ్ఱచందనం అక్రమ రవాణా తగ్గడం లేదు. చెక్‌పోస్టుల వద్ద నిజాయితీ గల అధికారులను నియమించినపుడు అక్రమ రవాణా అదుపులోకి వస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో గంజాయిని సాగు చేస్తున్నారు. అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి గంజాయిని స్వాధీనం చేసుకోవడమే కాదు, నిందితులకు సరైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. ఎఱ్ఱచందనం, గంజాయి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలను అమలు చేయాలి.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం